ATA Health Forum Seminar in Chicago

చికాగోలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు జరిగే ఆటా మహాసభల్లో భాగంగా ఆటా హెల్త్‌ఫోరం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వైద్యరంగంలో పేరుగడించిన ప్రముఖ డాక్టర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యకర జీవన విధానానికి అవసరమైన సూచనలను, సలహాలను వారు అందించనున్నారు. ప్యానల్‌ డిస్కషన్స్‌, సెమినార్‌లు జూలై 2వ తేదీన జరుగుతాయి. క్యాన్సర్‌, ఆయుర్వేద, న్యూట్రిషన్‌, జనరల్‌ హెల్త్‌ విషయాలతోపాటు రాఫిల్‌ బహుమతులు, ఆరోగ్యకరమైన వంటలు వంటి ఎన్నో కార్యక్రమాలను కాన్ఫరెన్స్‌ హెల్త్‌ కమిటీ ఏర్పాటు చేసింది.  హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగే సదస్సులో డా. కృష్ణ ఎస్‌ బత్తిన ప్రత్యేక ప్రసంగంచేయనున్నారు. డా.సురేష్‌ కూనపరెడ్డి, డా. విజి సుసర్ల, డా. రిచా జాయ్‌ పాల్గొంటున్నారు.