అయుత మహా చండీ యాగం చివరి రోజు సాయంత్రం పూర్ణాహుతితో ముగిసింది. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్‌ రావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయుత మహీ చండీ యాగం గత నాలుగు రోజుల మాదిరిగానే గురుప్రార్థన, మహాగణపతి పూజ, పుణ్యహవచనం, కుండ సంస్కారం జరిగిన తర్వాత ప్రధాన హోమ గుండంలో అగ్ని ప్రతిష్టను రుత్విజులు నిర్వహించారు. యాగశాల లోపల వున్న 101 హోమ గుండాల దగ్గర 1100 మంది రుత్వికులు, వారికి కావాల్సిన సమిధలు, పాయనం, నెయ్యి, కర్పూరం తదితర పూజా సామాగ్రిని ఇతర  బ్రాహ్మణులు సమకూర్చారు. ప్రధాన గుండంలో అగ్ని ప్రతిష్ట తార్వాత అగ్నిని ఆవాహన చేశారు. దానికి అగ్ని విహరణము అనే ప్రక్రియ ద్వారా మిగిలిన నూరు గుండాలలో ప్రతిష్ట చేశారు. మహా పూర్ణాహుతి చేయడానికి ముందు చతుర్వేద, మహారుద్ర, రాజశ్యామల, యాగశాలల్లో పూర్ణాహుతి జరిగింది.

అగ్ని విహరణలో భాగంగా జరిగిన హోమంలో ప్రతి రుత్విజుడు సప్తశతి మంత్రాలతో 700 ఆహుతులను పరమాన్నన ద్రవ్యంగా ఇచ్చారు. 1000 ఆహుతులను ఆజ్వద్య్రంగా ఇచ్చారు.  7లక్షల పరమాన్న ద్రవ్యం, 10 లక్షల ద్రవ్యం ఆహుతి చేశారు. అంతకుముందు జరిగిన తర్పణంలో వంద మంది రుత్వికులు పూర్వాంగ, ఉత్తరాంగ సహితంగా 700 మంత్రాలతో తర్పణం ఇచ్చారు. 7లక్షల నవాక్షరి మంత్రం కూడా జరిపించారు. అభిషేక జలాలతో యజమాని(కేసీఆర్‌) దంపతులకు అవభృతం చేయించారు. పూర్ణాహుతి కార్యక్రమాల్లో హాజరైన వారిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఉప ముఖ్యమంత్రి కెఇ. కృష్ణమూర్తి, మంత్రి ఘంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు, స్పీకర్‌ మధుసూధనాచారి, రిటైర్డ్‌ జడ్జి ఎల్‌. నర్సింహరెడ్డి, సినీ ప్రముఖులు జమున, తనికెళ్ల భరణి, డి.సురేష్‌బాబు ఉన్నారు.
Click here for Photogallery