ఓం నమో భగవతే రుద్రాయ... అంటూ బ్రాహ్మణుల స్తోత్ర పఠనంలో అయుత చండీ మహయాగం ప్రారంభమైంది. నిర్ణీత సమయానికి రుత్విజులు యాగస్థలానికి చేరుకుని పూజలు ప్రారంభించారు. ఉదయం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు దంపతులు యాగశాలకు చేరుకున్నారు. మంత్రి హరీష్‌ రావు ఇతర బ్రాహ్మణులు స్వాగతం పలికారు. చండీమాత విగ్రహం విగ్రహం ముందు ప్రధాన రుత్విజులు గోపికృష్ణ శర్మ, పణిశకాంశ శర్మ, హరినాథశర్మలు శృంగేరి పీఠం నుంచి ప్రత్యేకంగా వచ్చినన నరహరి సుబ్రహ్మణ భట్‌ ఆధ్వర్యంలో గురుప్రార్ధన జరిపారు. శ్రీ సచ్చిదానంద... చంద్రశేఖర భారతీ తీర్థ.... విద్యాతీర్థ గురుంభజే... వందే గురు పరంపఠ... సాష్టాంగ ప్రమాణ సమర్పయాని'' అంటూ రుత్వికులంతా ముఖ్యమంత్రితో సహ గురు ప్రార్ధన చేశారు. 

తర్వాత రెండువేల సప్తశతీ, 30 లక్షల నవారణ పూజ, శతుష్టష్టి యోగిని బలి, మహా గణపతి పూజలు ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌, హెటిరో డ్రగ్స్‌ చైర్మన్‌ పార్థసారథిరెడ్డి, డైరెక్టర్‌  రత్నాకర్‌ రెడ్డి, యశోధా హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ సురెందర్‌ రావు తదితరులు పూజలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ కుటుంబ సభ్యులతో హాజరై యాగం ప్రక్రియలను తిలకించారు. ఆంగ్లో ఇండియన్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌ పాల్గొన్నారు. శృంగేరి బాలి పీఠాథిపతి విధుశేఖర భారతీ మహాస్వామి తండ్రి కుప్ప శివసుబ్రహ్మణం, తాతా కుప్ప గోపాల వాజపేయి యుజి యాగంలో పాల్గొని కేసీఆర్‌ను  ఆశీర్వదించారు. మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీష్‌ రావు, ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రెండోరోజు కార్యక్రమంలో గురుప్రార్థనతో పాటు గోపూజ, ఏకాదశన్యాస పూర్వక ద్విసహస్ర చండీ పారాయణములు, మహా ధన్వంతరీ యాగము, రాజశ్వామల చతుర్వేద మహరుద్ర పురశ్చరణలు, మహా సౌరము, ఉక్త దేవతా జపములు, కుమారి, సువాసినీ, దంపతీ పూజ, మహా మంగళ హారతి తదితర కార్యక్రమాలు జరిగాయి.