ఘనంగా జిడబ్ల్యుటిసిఎస్ దీపావళి సంబరాలు

27-04-2017

ఘనంగా జిడబ్ల్యుటిసిఎస్ దీపావళి సంబరాలు

అమెరికాలోని వర్జీనియాలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. స్థానిక బాలబాలికల నృత్య ప్రదర్శనలతో, యాంకర్ మృదుల సునిశిత హాస్యంతో కూడిన వ్యాఖ్యానంతో, కృష్ణ చైతన్య - అంజనా సౌమ్యల మధుర గానంతో ఆద్యంతం రసవత్తరంగా నడిచింది. స్టోన్ బ్రిడ్జ్ హైస్కూల్ ఆడిటొరియంలో జరిగిన ఈ వేడుకలకు తెలుగు వారు భారీగా హాజరయ్యారు. వర్జీనియా, మేరీలాండ్, డి.సి మూడు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులతో ఆడిటొరియం కిక్కిరిసిపోయింది.

యాభైమంది పైగా నృత్యకారిణులతో సాయికాంత రాపర్ల గారు అందించిన "దీపావళి వెలుగులు" కార్యక్రమం అందరినీ అలరించింది. కళామండపం చిన్నారులు ప్రదర్శించిన జానపద నృత్యం, పిల్లల, పెద్దల ఫాషన్ షోలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. GWTCS సభ్యులు సుబ్బా కొల్లా గారిని, అంజన్ చీమలదిన్నె గారిని, అడపా ప్రసాద్ గారిని, పునీత్ అహ్లువాలియా గారిని, వర్జీనియా స్టేట్ సెక్రెటరీ డిక్ బ్లాక్ గారిని, డెప్యుటీ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మన్‌ప్రీత్ ఆనంద్ సింగ్ గారిని సత్కరించారు. GWTCS అధ్యక్షులు కిషోర్ దంగేటి, కార్యవర్గ సభ్యులు సత్యన్నారాయణ మన్నె, సుధా పాలడుగు, తనుజ గుడిసేవ, చంద్ర మలవతు, అనిల్ ఉప్పలపాటి, ురేష్ మారెళ్ళ, కృష్ణ లామ్, రామకృష్ణ చలసాని, రాకేశ్ బత్తినేని, లాక్స్ చేపురి, శ్రీధర్ మారం ఆహూతులందరికి ధన్యవాదాలు తెలియచేశారు. 

ఆ తరం నుంచి ఈ తరం వరకు బహుళ ప్రాచుర్యం పొందిన కొన్ని పాటల్ని కృష్ణ చైతన్య, అంజనా సౌమ్య అద్భుతంగా ఆలపించారు. 

చౌపాటి రెస్టారెంట్ వారు చవులూరించే పసందైన విందు భోజనం అందించారు.