గ్రేటర్ డెలావేర్ వ్యాలీలో ఘనంగా దీపావళి సంబరాలు

27-04-2017

గ్రేటర్ డెలావేర్ వ్యాలీలో ఘనంగా దీపావళి సంబరాలు

గ్రేటర్‌ డెలావేర్‌ వ్యాలీ తెలుగు సంఘం (టీఏజీడీఏ) ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. కింగ్‌ ఆఫ్‌ ప్రుసియా కీల్‌బర్‌ రోడ్డులోని అప్పర్‌ మెరియన్‌ మిడిల్‌ స్కూల్‌లో దీపావళి వేడుకలు నిర్వహించారు. టీఏజీడీఏ అధ్యక్షుడు హరినాథ్‌ బుంగతావుల సారథ్యంలో టీఏజీడీవీ ఈ కార్యక్రమం నిర్వహించింది. ఇక్కడ ఇంతకుముందెన్నడూ లేని విధంగా దాదాపు 600 మందికి పైగా అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. టీఏజీడీవీ యూత్‌ ఆలపించిన మా తెలుగు తల్లికి గేయం అమెరికా జాతీయ గీతంతో  కార్యక్రమాన్ని ప్రారంభించారు. టాలీవుడ్‌ గాయకులు సుమంజలి, సందీప్‌, సుందరి, బుధవారపు సిస్టర్స్‌ , నేహ, మిమిక్రీ ఆర్టిర్ట్‌ లోహిత్‌ తదితరులు తమ పాటలతో మరింత జోష్‌ నింపారు.  కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మౌంట్‌గోమెరీ కంట్రీ కమిషనర్‌ జోసెఫ్‌ సి.గాలే పాల్గొనానర. శైలజ అడ్లూరు ఆయనను పరిచయం చేయగా... హరినాథ్‌ బుంగతావుల గాలేను సన్మానించారు.

ఈ సందర్భంగా టీఏజీడీవీ బృందం తమ దాతలను సన్మానించింది. మహారాజ పోషకులు - నాట్స్‌ లీడర్‌షిప్‌ టీమ్‌ మోహన్‌ కృష్ణ మన్నవ, శ్రీధర్‌ అప్పసాని, రాజపోషకులు -భావన, డాక్టర్‌ రఘు సిరాగవరపు, పోషకులు - నాటా లీడర్షిప్‌ టీమ్‌, తానా లీడర్షిప్‌ టీమ్‌, స్వర్ణ జువెల్స్‌, రాధిక బుంగతావుల, కవిత కొత్తపల్లి లను సన్మానించారు. యువజన సామాజిక కర్యాక్రమల కోసం 420 డాలర్లను అందించిన టీఏజీడీవీ యూత్‌ సభ్యులు ప్రేమ్‌ పోలం రెడ్డి, యజత్‌ బుంగతావుల, సాయి కొత్తపల్లి లకు ప్రెసిడెంట్‌, ఈసీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఏజీడీవీ అధ్యక్షుడు హరినాథ్‌ బుంగతావుల, ఉపాధ్యక్షుడు సాంబయ్య కొత్తపాటి, సెక్రటరీ కిరణ్‌ కొత్తపల్లి, ట్రెజరర్‌ విజయ్‌ భాస్కర్‌ పోలంరెడ్డి, జాయింట్‌ సెక్రటరీ నిషిత వెంకన్నగారి, జాయింట్‌ ట్రెజరర్‌ విజయ్‌ వీరమాచనేనిలతో పాటు సభ్యులు శివ అనుంతుని, అనుపమ దొంతినేని, మధుసూదన్‌ రెడ్డి గోనిపాటి, లక్ష్మి ముద్దన, కృష్ణ నందమూరి, అరవింద్‌ పరుచూరి, గోపి వంగ్వాల తదితరులు పాల్గొన్నారు. ఇతర కమిటీల సభ్యుల మహిత అప్పసాని, సింధు బుధవారపు, మూర్తి నూతనపాటి, పార్థసారథి మండల, రమణ రాకోతు, రవి ఇంద్రకంటి, నిరంజన్‌ యనమంద్ర, రామకృష్ణ గొర్రెపాటి,  మధు బూదాటి, ప్రసాద్‌ సానికొమ్ము, శ్రీని గట్టు, బాబు మేడి,  అజయ్‌ యురత, మధు కొల్లి, రోశయ్య కూడా దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. దీపావళి సంబరాల్లో పాల్గొన్న వారందరికీ టీఏజీడీవీ కిరణ్‌ కొత్తపల్లి కృతజ్ఞతలు తెలిపారు.  కాగా దీపావళి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేసిన ఈసీకి వీక్షకుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి.