ఘనంగా ఆప్త దీపావళి సంబరాలు

27-04-2017

ఘనంగా ఆప్త దీపావళి సంబరాలు

అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆప్త) ఆధ్వర్యంలో నార్త్‌ ఈస్ట్‌ రీజినల్‌ కాన్ఫరెన్స్‌ దీపావళి సంబరాలు మాంచెస్టర్‌లో అంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి తెలుగు వారు తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. పెద్దలు, పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో  అలరించాయి. రఘు కుంచె, ఆదర్శిని, శేషు ఆకుల,  శ్రవణ్‌ మట్లపూడి, షాలిని గంధం, శుభ రావూరి, సుభాస్‌ తన్నీరు. కుమారి  లావణ్య  అందే త మ గానామృతంతో ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సంగీత విభావరిని రవి వర్రే, శేఖర్‌ నల్లం స్పాన్సర్‌ చేశారు. పిల్లల చదువులమీద సెక్స్ట్‌ జెన్‌ కిడ్స్‌ ప్రోగ్రాంని కిరణ్‌  పళ్ళా నిర్వహించారు. తల్లితండ్రులు, పిల్లలు పాల్గొని భవిష్యత్తు ప్రణాళికలను వాటి మీద ఉన్న సందేహాలని నివృత్తి చేసుకున్నారు.

ఆప్త ఆర్గనైజషన్‌ వ్యవస్థాపకులలో ఒకరైన శ్రీనివాస్‌ చిమట, ఆప్త ప్రెసిడెంట్‌ గోపాల గూడపాటి, బోర్డు సెక్రటరీ రాజేష్‌ యాళ్ళబండి  బోర్డు డైరెక్టర్‌ మధు దాసరి, వైస్‌ ప్రెసిడెంట్‌ జిడుగు సుబ్రహ్మణ్యం, సెక్రటరీ శౌరి ప్రసాద్‌ కొచ్చెర్ల, జాయింట్‌ ట్రెజరర్‌ సురేష్‌ దూళిపూడి,  ఆప్త ఇంటర్నల్‌ ఆడిటర్‌ వెంకట్‌ యనములు, ఆప్త్‌ నార్త్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రీజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మధు ఉల్లి, ఎంపైర్‌ రీజియన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బనారసీ బాబు తిప్పా, న్యూ జెర్సీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సత్య వెజ్జు, కల్చరల్‌ చైర్‌ రాజేష్‌ సుంకర, వైస్‌ చైర్‌ సురేష్‌ క రోతు ఈ కార్యక్రమంలో పాల్గొని పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంఏపీ (ఆప్తా మెడికల్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రాం) చైర్‌ డాక్టర్‌ కుమార్‌ కొత్తపల్లి, డాక్టర్‌ రవి ఆకుల, డాక్టర్‌ వెంకట సత్యనారాయణ నాగిరెడ్డి, డాక్టర్‌ నీరజ చవాకుల పాల్గొని బయాబెటిస్‌ మీద ఆవేర్నెస్‌, ప్రశ్నోత్తరాల సమాయాన్ని నిర్వహించారు. నార్త్‌ ఈస్ట్‌ రీజియన్‌లో ప్రముఖ, సీనియర్‌ డాక్టర్స్‌ అయిన డాక్టర్‌ సూర్యానారాయణ సీరం, డాక్టర్‌ సాయి కొల్ల, ప్రొఫెసర్‌ అల్లం అప్పారావులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.

ఈ కార్యాక్రమానికి శ్రీధర్‌ నిశ్శంకరరావు, శ్రీనివాస్‌ కమ్మిలి, సురేష్‌ కరోతు, శ్రీనివాస్‌ సుంకర, నిరంజన్‌ కొప్పెర్ల, శుభ రావూరి, సుభాష్‌ తన్నీరు. సురేష్‌ తాడిశెట్టి, శిల్ప తాడిశెట్టి, మురళి శెట్టి, రాజేంద్ర కొల్లిపర అనిల్‌ కుమార్‌ వీరిశెట్టి, శివ మోలబంతి,  ప్రకాష్‌ ఆచంట, హరి సింహాద్రి, లక్ష్మి సింహాద్రి, సత్య అడపా, శివ మట్ట, మహేష్‌  బొల్లిముంత, పవన్‌ ఉప్పు, నందిత బీగాల,  నందిని చిన్నాల, లావణ్య  రమా ముత్యాల, వెంకట్‌ చవాకుల, సమీరా చవాకుల,  ఆనంద్‌ జవ్వాజి, ఆనంద్‌ చిక్కాల, యతీంద్ర శీలం, కృష్ణ ఐనబత్తిని, వైఆర్‌ సి రావు కార్యక్రమం విజయానికి తమ అమూల్యమైన సేవలు అందించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా సురేష్‌ కరోతు, శ్రీనివాస్‌ సుంకర, శారద కొప్పెర్ల, శుభ రావూరి, కళ్యాణి తన్నీరు. ప్రవీణ రావూరు వ్యవహరించారు. చివరిగా నటరాజు ఇల్లూరి వందన సమర్పణ చేశారు.

అతిథులందరికి నార్త్‌ ఈస్ట్‌ రీజినల్‌ కాన్ఫరెన్స్‌ దీపావళి సంబరాలు టీం తరపున కన్వీనర్‌ శ్రీ నటరాజు ఇల్లూరి, కో కన్వీనర్‌ శ్రీ శ్రీధర్‌ నిశ్శంకరరావు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వైస్సార్సీపీ యూ.యస్‌.ఏ కన్వీనర్‌ శ్రీ రత్నాకర్‌ పండుగాయల, యువసేన వాలంటీర్స్‌ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఆప్త నార్త్‌ ఈస్ట్‌ రీజినల్‌ కాన్ఫరెన్స్‌ దీపావళి సంబరాలు టీం కృతజ్ఞతలు తెలిపింది. ధరణి రెస్టారెంట్స్‌ గ్రూప్‌ అధినేత శ్రీ బాస్కర్‌ రెడ్నం, రుచికరమైన తెలుగు విందు భోజనాలు స్పాన్సర్‌ చేశారు. శ్రీమయి డిజైన్స్‌ అధినేత్రి శ్రీమతి నందిత బీగాల రీజినల్‌ కాన్ఫరెన్స్‌కి విచ్చేసిన అతిధులందరికి ఆప్త, శ్రీమయి డిజైన్స్‌ లోగోతో ఉన్న అందమైన బ్యాగ్‌ను బహుకరించారు.