ఉత్సాహంగా 'గీత' దీపావళి సంబరాలు

27-04-2017

ఉత్సాహంగా 'గీత' దీపావళి సంబరాలు

గ్రేటర్‌ ఇండియానాపొలిస్‌ తెలుగు అసోసియేషన్‌ (గీత) ఆధ్వర్యంలో దీపావళి సంబరాలను వైభవంగా జరిపారు. నవంబర్‌ 19వ తేదీన వెస్ట్‌ఫీల్డ్‌లోని వెస్ట్‌ఫీల్డ్‌ హైస్కూల్‌ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకల్లో ఎంతోమంది పాల్గొన్నారు. 550 మంది అతిధులుగా వచ్చారు. గీత కార్యవర్గ సభ్యులు, గీత బోర్డ్‌ మెంబర్లు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు. ముఖ్య అతిధులుగా గవర్నర్‌ మెక్‌ పెన్స్‌ అడ్వయిజర్‌, స్పెషల్‌ అసిస్టెంట్‌ డిగో మోరల్స్‌, తెలుగు ప్రముఖుడు రాజు చింతల, తానా అధ్యక్షుడు జంపాల చౌదరి తదితరులు వచ్చారు. గాయని గాయకులు విజయలక్ష్మీ, యాజిన్‌ నిజర్‌, అదితి భావరాజు పాడిన పాటలు అందరినీ మైమరపింపజేశాయి. అజయ్‌ పొనుగోటి, చంద్రశేఖర్‌ కృష్ణమనేని, వాసు గోరంట్ల, శ్రీనివాస్‌ మజ్జి, శ్రవణ్‌ పతర్ల, హరి ఎస్‌. నాగిరెడ్డి, మోహన్‌ దేవరాజు, సందీప్‌ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సంఘం అధ్యక్షుడు నవీన్‌ రెడ్డి సిరిగిరి, వైస్‌ ప్రెసిడెంట్‌ శరత్‌ బుద్దె, సెక్రటరీ వరుణ్‌ బొంగు, ట్రెజరర్‌ శిరీష్‌ రాయిచింతల, జాయింట్‌ సెక్రటరీ శ్రీమతి లత గోగినేని, మధు మేదా, శ్రీవల్లి మజ్జి తదితరులు వేడుకల విజయవంతానికి కృషి చేశారు.


Click here for Event Gallery