ఆటా-ప్రవాసమిత్ర బతుకమ్మ వేడుకలు

27-04-2017

ఆటా-ప్రవాసమిత్ర బతుకమ్మ వేడుకలు

అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌, ప్రవాస మిత్ర సంయుక్తాధ్వర్యంలో హైదరాబాద్‌లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. బేగంపేటలోని జీవనజ్యోతి ఆడిటోరియంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం శాఖ మంత్రి చందూలాల్‌, టీఆర్‌ఎస్‌ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కరీంనగర్‌ జడ్‌పిటిసి తుల ఉమ, మంత్రి ఈటెల రాజేందర్‌ సతీమణి జమున, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షురాలు శారద, బిజెపి మహిళామోర్చా అధ్యక్షురాలు అరుణజ్యోతి, అమెరికన్‌ తెలంగాణ అధ్యక్షుడు రామ్మోహన్‌ రెడ్డి కొండా, కో ఆర్డినేటర్‌ రామచంద్రారెడ్డి, వెంకట్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రతిభ చూపిన పలువురికి ప్రవాసీ మిత్ర అవార్డులను కూడా ప్రదానం చేశారు.