MP Kavitha Participates in Bathukamma Celebrations 2016 in San Francisco

శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫ్రీమాంట్‌ నగరంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బంగారు బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి ఎలుగెత్తి చాటింది. రాయల్‌ ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ ఎన్నారైలు భారీగా హాజరయ్యారు. అంతకుముందు వేద టెంపుల్‌ ప్రాంగణంలో తెలంగాణ ఎన్నారై మహిళలు బతుకమ్మ ఆటపాటలను సాధన చేశారు. వేదటెంపుల్‌లోనే గౌరీదేవికి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోనే ఉన్న స్టీవెన్‌సన్‌ బులివార్డ్‌లోని ఆడిటోరియంలో పెద్ద ఎత్తున బతుకమ్మలను పేర్చారు. అందరూ కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నార్త్‌ అమెరికా, తెలంగాణ అమెరికన్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ నాయకులు, భారత రాయబార కార్యాలయం కాన్సుల్‌ జనరల్‌ వెంకటేశన్‌ ఆశోక్‌, ప్రీమాంట్‌ సిటీ మేయర్‌ బిల్‌ హారిసన్‌,  డిప్యూటీ మేయర్‌ సవితావైద్యనాథన్‌, తెలంగాణ జాగృతి అమెరికా  శాఖ అధ్యక్షుడు శ్రీధర్‌, నాయకులు సతీశ్‌, మురళి, సత్యపాల్‌, నరేశ్‌, గౌరీశంకర్‌, విజయ్‌ చవ్వా, భిక్షం, భాస్కర్‌, ఉదయ్‌, అభిలాశ్‌, మాధవి, వినయ్‌ ఝాన్సీరెడ్డి, అప్పిరెడ్డి,  గోవర్థన్‌ తదితరులు పాల్గొన్నారు.