అట్లాంటాలో దుర్గమ్మకు జరిగిన విశేష కుంకుమార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికాలోని పది రాష్ట్రాల్లో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు దుర్గగుడి నుంచి పలువురు అర్చకులు, ఆలయ అధికారులు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అట్లాంటాలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించగా, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఉభయదాతలు తరలివచ్చారు. ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్‌, శంకర శాండిల్య, ఎస్‌.శివప్రసాద్‌, కె.గోపాలకృష్ణ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దుర్గగుడి ఏఈవో, పీఆర్వో అచ్యుత రామయ్య పర్యవేక్షించారు.


Click here for Event Gallery