వివిధ విశ్వవిద్యాలయాలను సందర్శించిన మంత్రి బృందం

24-04-2017

వివిధ విశ్వవిద్యాలయాలను సందర్శించిన మంత్రి బృందం

అమెరికా పర్యటనలో భాగంగా వివిధ విశ్వవిద్యాలయాలను మంత్రి గంటా శ్రీనివాసరావు, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ శ్రీమతి సంధ్యారాణి, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి సందర్శించారు. అక్కడి బోధనా పద్ధతులు, అడ్మినిస్ట్రేటివ్‌ వ్యవహారాలు, నిధుల కేటాయింపు, సిలబస్‌ వంటి విషయాలను తెలుసుకున్నారు. న్యూజెర్సిలోని నార్త్‌ బెర్గెన్‌ స్కూల్‌, పిట్స్‌బర్గ్‌లోని కార్నిగె మెల్లాన్‌ యూనివర్సిటీని, సిన్సినాటిలో ఉన్న సిన్సినాటి కంట్రీ డే స్కూల్‌ను, అప్పర్‌ అండ్‌ మిడిల్‌ స్కూల్స్‌ సౌత్‌ జిమ్‌ అండ్‌ థియేటర్‌ను మంత్రి గంటాతోపాటు తదితరులు సందర్శించారు. వాషింగ్టన్‌లోని డిసి పబ్లిక్‌ ఛార్టర్‌ స్కూల్‌ ఆఫ్‌ బోర్డ్‌ను, ఫెయిర్‌ఫ్యాక్స్‌లో ఉన్న జార్జ్‌ మేసన్‌ యూనివర్సిటీని, టెక్సాస్‌లోని ప్లేనో స్కూల్‌ను సందర్శించడంతోపాటు, వివిధ నగరాల్లో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్‌ సెషన్స్‌లోనూ మంత్రి గంటాతోపాటు కమిషనర్‌ సంధ్యారాణి, జయరామ్‌ కోమటి పాల్గొన్నారు.