TANA Folk Arts Festival in Rajahmundry

ఇక్కడ పుట్టడమే తాము చేసుకున్న అదృష్టమని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు జంపాల చౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన తానా జానపద కళోత్సవంలో మాట్లాడుతూ,  ఈ గడ్డపై పుట్టడమే అదృష్టమని అటువంటి జన్మభూమి రుణాన్ని తీర్చుకోవడంతోపాటు మాతృభాష, కళల పరిరక్షణకు తమవంతుగా కృషి చేస్తున్నామని చెప్పారు. తాము అమెరికాలో ఉన్న జన్మభూమిని సంస్కృతీ, సంప్రదాయాలను మరిచిపోలేదని చెప్పారు. తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన మాట్లాడుతూ, ఈ నేలపై ఉన్న ప్రేమతోనే తమ అధ్యక్షుడు జంపాల చౌదరి తమ పిల్లలకు వేమన, నన్నయ్యగా పేరు పెట్టుకున్నారని చెప్పారు. పార్లమెంట్‌ సభ్యుడు మురళీ మోహన్‌ మాట్లాడుతూ, దేశం రుణం తీర్చుకోవాలని తానా 40 ఏళ్ళుగా అమెరికాలో ఉండి ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. 
 

Click here for Photogallery