Jay Talluri Contesting for TANA President Election 2017

ఉత్తర అమెరికా తెలుగు సంఘంతో విడదీయరాని అనుబంధాన్ని జయశేఖర్‌ తాళ్ళూరి కొనసాగిస్తున్నారు. తానా ఫౌండేషన్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలను ఇండియాలోనూ, అమెరికాలోనూ అమలుపరచి కమ్యూనిటీకి ఎంతో దగ్గరయ్యారు. అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, డిజిటల్‌ స్కూల్‌ ఏర్పాటులో, మంచినీటి సౌకర్యాల కల్పనకు జే తాళ్ళూరి తనవంతుగా సాయం అందించారు. తెలంగాణలోని భద్రాచలంలో జన్మించిన జయశేఖర్‌ తాళ్ళూరి మెకానికల్‌ ఇంజనీర్‌ చదివి న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. అనేక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు ఆయన అధిపతిగా కొనసాగుతున్నారు. తానాను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న తపనతోనే తానా అధ్యక్షపదవికి పోటీ పడుతున్నట్లు తెలిపారు. నేను అనుకుంటే ఒక అడుగు...మన అనుకుంటే ముందడుగు అంటూ 40వసంతాల తానా మన కోసం అంటూ ప్రచారాన్ని జేతాళ్ళూరి ప్రారంభించారు.