తానా నీది నాది మనందరిదీ - శ్రీనివాస గోగినేని

21-04-2017

తానా నీది నాది మనందరిదీ - శ్రీనివాస గోగినేని

ఉత్తర అమెరికా తెలుగు సంఘంలో వివిధ కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా నిర్వహించడం ద్వారా చాలామందిని శ్రీనివాస్‌ గోగినేని ఆకర్షించారు. తానా ఫౌండేషన్‌ చైర్మన్‌గా ఉంటూ ఇటీవల మాతృరాష్ట్రాలలో వివిధ కార్యక్రమాలను చేశారు. తానా ఫౌండేషన్‌ ద్వారా చేస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు అమెరికాలోని వివిధ నగరాల్లో తానా 5కె రన్‌ను నిర్వహించి తానాకు మంచి ప్రచారాన్ని ఆయన తీసుకువచ్చారు. తానా 20వ మహాసభలను విజయవంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన శ్రీనివాస్‌ గోగినేని ఇప్పుడు తానాను మరింత పటిష్టంగా ఉంచాలన్నదానిపై దృష్టిని పెట్టానని, అందులో భాగంగానే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తానా నీది నాది మనందరిదీ అంటూ ప్రచారాన్ని కూడా ఆయన ప్రారంభించారు.