ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షపదవికి పోటీ పడుతున్న జే తాళ్ళూరి తన ప్రచారంలో భాగంగా న్యూజెర్సిలోని ఎడిసన్‌లో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగువాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తనను గెలిపిస్తే తానాను మరింతగా బలోపేతం చేస్తానని హామి ఇచ్చారు. సభ్యత్వ సంఖ్యను మరింతగా పెంచుతానన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో న్యూజెర్సి ప్రముఖుడు చివుకుల ఉపేంద్ర, తానా కార్యదర్శి పదవికి పోటీ పడుతున్న లావు అంజయ్య చౌదరితోపాటు తానా నాయకులు రవి పొట్లూరి, లక్ష్మీ దేవినేని, రవి మందలపు, రత్న మూల్పూరి, విద్యా గారపాటి, విశ్వనాథ్‌ నాయునిపాటి, నాగరాజు నలజుల తదితరులు పాల్గొన్నారు.


Click here for Photogallery