మిడ్ అట్లాంటిక్ రీజినల్ కో ఆర్టినేటర్ పదవికి నాగరాజు నలజుల పోటీ

20-04-2017

మిడ్ అట్లాంటిక్ రీజినల్ కో ఆర్టినేటర్ పదవికి నాగరాజు నలజుల పోటీ

తానా ఎన్నికల్లో ఎంతోమంది ఔత్సాహికులు పోటీకి ముందుకు వచ్చారు. ఫిలడెల్ఫియాలో ఉంటున్న నాగరాజు నలజుల తానా ఎన్నికల్లో మిడ్‌ అట్లాంటిక్‌ రీజియన్‌లో తానా రీజినల్‌ కో ఆర్డినేటర్‌ పదవికి పోటీ చేస్తున్నారు. మాతృభాష సేవలో భాగంగా ఈ ప్రాంతంలో 'పాఠశాల' నిర్వహణలో పాలుపంచుకుంటున్న నాగరాజు నలజుల తానా నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.  కమ్యూనిటీకి మరింతగా కృషి చేయాలన్న ఆశయంతో మిడ్‌ అట్లాంటిక్‌ రీజియన్‌లో తానా రీజినల్‌ కో ఆర్డినేటర్‌ పదవికి పోటీ చేస్తున్నానని, కమ్యూనిటీకి మరింతగా సేవ చేసే అవకాశం తనకు కలిగేలా గెలిపించాలని కోరుతున్నారు.