మూన్ షైన్ సినిమాస్ కు దక్కిన 'మజిలీ' ఓవర్సీస్ రైట్స్

16-02-2019

మూన్ షైన్ సినిమాస్ కు దక్కిన 'మజిలీ' ఓవర్సీస్ రైట్స్

టాలీవుడ్‌లో హిట్‌ ఫెయిర్‌గా పేరు పొందిన  నాగచైతన్య, సమంత కలిసి నటించిన చాలా సినిమాలు విజయవంతమయ్యాయి. నిజజీవితంలో పెళ్లి ద్వారా ఒక్కటైన ఈ జంట పెళ్ళి తరువాత కలిసి నటిస్తోన్న తొలి సినిమా 'మజిలీ'. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ఈ చిత్ర ఓవర్సీస్‌ హక్కుల కోసం చాలా సంస్థలు పోటీపడ్డాయి. అయితే చివరకు 'మూన్‌షైన్‌ సినిమాస్‌' ఆ హక్కులను గెలుచుకుంది. ఈ చిత్రాన్ని అమెరికా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

నాగచైతన్య కెరీర్‌లో ఎన్నడూలేనన్ని అధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో విడుదల చేయనున్నట్లు మూన్‌షైన్‌ సినిమాస్‌ ప్రకటించింది. అమెరికా మొత్తానికి ఈ సరికొత్త 'మజిలీ'ని చూపిస్తామంటోంది. ఈ చిత్రం ఉగాది కానుకగా ఏప్రిల్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే దానికి ఒకరోజు ముందుగానే అంటే ఏప్రిల్‌ 4న ఓవర్సీస్‌లో ప్రీమియర్‌ షోలు ఏర్పాటు చేస్తున్నట్లు మూన్‌షైన్‌ వెల్లడించింది.