LIE movie review

తెలుగుటైమ్స్ .నెట్ రేటింగ్ 2.5/5
బ్యానర్ : 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్,
నటీనటులు: నితిన్, మేఘ ఆకాష్, అర్జున్ సర్జా, బ్రహ్మానందం, శ్రీ రామ్, నాజర్, అజయ్,
రవి కిషన్, బ్రహ్మాజి, ప్రిథ్వి రాజ్ మరియు జిబ్రయీల్ ట్రేసీ తది తరులు....

సినిమాటోగ్రఫీ: వై. యువరాజ్, ఎడిటింగ్ : యస్ ఆర్ శేఖర్,
సంగీతం : మణి శర్మ, పాటలు : కాసర్ల శ్యామ్, కిషన్ కాంత్,
సమర్పణ: వెంకట్ బోయినపల్లి, నిర్మాతలు  : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర,
కథ, మాటలు, దర్శకత్వం : హను రాఘవపూడి 
విడుదల తేదీ:11.08.2017

 

‘అ.. ఆ’ తర్వాత  నితిన్ స్టైలిష్ గా చేసిన సినిమా కావడం వలన ‘లై’ పై మొదటి నుండి మంచి అంచనాలున్నాయి.  అంతేగాక ఫస్ట్ లుక్, పాటలు, ట్రైలర్ బాగుండటం కూడా సినిమాకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. హను రాఘవపూడి దర్శకత్వంలో సక్సెస్ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో  రూపొంది,  భారీ పోటీ నడుమ ఈ సినిమా ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

కథ:

ఇండియాలో ఉన్న యావత్  పోలీస్ ఫోర్స్  భయంకరమైన క్రిమినల్ పద్మనాభన్ (అర్జున్) కోసం వెతుకుతుంటారు. పద్మనాభన్ మాత్రం యూఎస్ లో సెటిలై ఉంటాడు. పాతబస్తీకి చెందిన ఎలాంటి భాధ్యతలు లేని కుర్రాడు ఏ.సత్యం (నితిన్) పెద్దింటి అమ్మాయిని పెళ్లాడాలనే ఆలోచనతో ఉన్న సత్యానికి చైత్ర (మేఘా ఆకాష్) పరిచయం అవుతుంది. యూఎస్ టూర్ ఉండటం వల్ల పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న చైత్ర సత్యంతో కలిసి యూఎస్ ట్రిప్ వేస్తుంది. ఇద్దరు ఒకరికి ఒకరు అబద్ధాలు చెప్పుకుంటూ ప్రేమలో పడతారు.  ఈజీ మనీ కోసం ట్రై చేసే ఏ.సత్యం అనుకోని విధంగా హీరోయిన్ కోసం అమెరికా వెళ్తాడు. అలా అమెరికా వెళ్లిన సత్యం పద్మనాభంతో గొడవపడతాడు. ఆ గొడవతో సత్యం జీవితం తలకిందులైపోతుంది. అలాంటి సమయంలో అతనేం చేశాడు ? అసలు ఈ  పద్మనాభన్ ఎవరు ? అతనితో నితిన్ ఎందుకు గొడవపడాల్సి వచ్చింది ? అనేదే ఈ సినిమా..

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్:

సత్యం గా నితిన్ నటన అదుర్స్ అని చెప్పొచ్చు. స్టైలిష్ లుక్ లో నితిన్ బాగా ఆకట్టుకున్నాడు. కొంచెం ఓవర్ గా అనిపించే పాత్రను కూడా మంచి ఈజ్ తో చేసేశాడు. అతని డ్యాన్సులు, ఫైట్స్, నటన అన్నీ కూడా చాలా బాగున్నాయి.  అ..ఆ... తర్వాత నితిన్ ఈ సినిమాతో రావడం అతని కెరియర్ కు మంచి హెల్ప్ అవుతుంది. ఇక చైత్రగా మేఘా ఆకాష్ మంచి నటన కనబరిచింది. మొదటి సినిమానే అయినా ఆమె మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. విలన్ గా అర్జున్ అదరగొట్టాడు. స్టైలిష్ విలన్ గా అర్జున్ కు మంచి పేరొస్తుంది.అర్జున్ కూడా పాత్రలోని వేరియేషన్స్ ను పర్ఫెక్ట్ గా పలికిస్తూ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. ఆ పాత్రకు అర్జున్ చెప్పిన డబ్బింగ్ కూడా చాలా బాగుంది.  శ్రీరాం, అజయ్, నాజర్, రవి కిషన్, బ్రహ్మాజి, పృధ్విరాజ్, బ్రహ్మానందం అంతా తమ పాత్రల మేరకు నటించారు.

సాంకేతికవర్గం:

దర్శకుడు హను మంచి థ్రిల్లర్ తో లై తీశాడు నిరుత్సాహాన్ని కలిగించే విషయం ఎంటర్టైన్మెంట్ లేకపోవడం. చాలా చోట్ల కామెడీని పెట్టె స్కోప్ ఉన్న కూడా దర్శకుడు ఆ స్పీడ్ ను వాడుకోలేదు. దీంతో వినోదానికి చోటు లేకుండా పోయింది. అలాగే ఇందులో కొన్ని అనవసరమైన ట్రాక్స్ కుండా ఉన్నాయి. యాక్షన్ సీన్స్  మాత్రం హైలెట్ గా చెప్పొచ్చు . మణిశర్మ మ్యూజిక్ కొత్తగా ఏమి లేదు. కెమెరామెన్ కూడా బాగా వర్క్ అవుట్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కడ రాజి పడలేదు. సినిమాను ఎంత రిచ్ గా తీశారో సినిమా తెర మీద చూస్తేనే అర్ధమవుతుంది. 

విశ్లేషణ:

సినిమా టైటిల్ ప్రకారంగానే లవ్, ఇంటెలిజెన్స్, ఎన్మిటీ ఈ మూడు అంశాలు సినిమాలో ఉన్నాయి. హను రాసుకున్న కథ కథనాలు మేజర్ ప్లస్ పాయింట్స్.. చిత్రం మంచి ప్లేట్ లైన్ ను, బలమైన స్టార్ నటీనటుల్ని కలిగి ఉన్నాకూడా తీసిన విధానం సరిగా లేకపోవడం వలన దెబ్బతింది.   అబద్ధం చుట్టూ తిరిగే కథగా లై కొత్త అప్పీల్ ను చూపిస్తుంది. అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమగాధ తర్వాత నితిన్ తో హను చేసిన ఈ ప్రయత్నం ఇంప్రెసివ్ గా ఉంది. అయితే కథ కథనాల్లో కాస్త ఎంటర్టైన్మెంట్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. సినిమా ఎంత స్టైలిష్ గా అనిపించినా కొద్దిగా అక్కడక్కడ ల్యాగ్ అయినట్టు చెప్పొచ్చు. అర్జున్ విలనిజం బాగుంది. తను రాసుకున్న కథకు పర్ఫెక్ట్ యాక్టర్స్ ను ఎంపిక చేసుకున్నాడు హను. స్టైలిష్ మూవీగా నితిన్ లై ఆడియెన్స్ మెప్పుపొందే అవకాశం ఉంది.