Fidaa Movie Review

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3.5/5

బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,
నటీనటులు : వరుణ్ తేజ్, సాయి పల్లవి,రాజా చేంబోలు,సాయి చంద్, శరణ్య ప్రదీప్, గీత భాస్కర్,
సత్యం రాజేష్, హర్షవర్ధన్ రాణే,నాథన్ స్మలెస్, షరా బెర్రీ,లిడియా పగన్ తది తరులు నటించారు 

సినిమాతోగ్రఫీ : విజయ్ సి కుమార్, ఎడిటింగ్ : మార్తాండ్ కే వెంకటేష్,
సంగీతం : శక్తి కాంత్ కార్తిక్, పాటలు : సిరివెన్నెల సీతా రామ శాస్ట్రీ, సుద్దాల అశోక్ తేజ, వనమాలి, చైతన్య పింగళి,

నిర్మాతలు  : దిల్ రాజు, శిరీష్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం : శేఖర్ కమ్ముల

విడుదల తేదీ: 21.07.2017

 

శేఖర్ కమ్ముల సినిమా అంటే మొదటి నుండి యూత్ లో ఓ మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన గత సినిమాలు ఆనంద్, హ్యాపీడేస్, గోదావరి చిత్రాలు క్లీన్ అండ్ నీట్ మూవీస్ అయితే లీడర్  స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు ఎలావుండాలో తెలియ చేసిన చిత్రం  గా  ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. అయితే తరువాత వచ్చిన రెండు సినిమాలు  నిరుత్సాహ పరిచిన మరల చాలా గ్యాప్ తీసుకొని మెగా హీరో వరుణ్ తో దిల్ రాజు బ్యానర్ లో శేఖర్ చేసిన సినిమా ఫిదా ప్రేక్షకులని ఎ స్థాయిలో ఆకట్టుకుందో ఓ సారి తెలుసుకుందాం.

కథ:

అమెరికాలో డాక్టర్ గా పని చేసే వరుణ్ (వరుణ్ తేజ్) తన అన్నయ్యకి పెళ్లి సంబంధం కోసం తెలంగాణ లోని  బాన్సువాడకి వస్తారు. అక్కడ వరుణ్ అన్నయ్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి భానుమతి(సాయి పల్లవి) అని ఓ చెల్లి ఉంటుంది. ఆమె చేసే అల్లరితో ఆ పెళ్లిలో వరుణ్, భానుమతి అనుకోకుండా ఒకరికి ఒకరు తెలియకుడా ప్రేమలో పడతారు. పెళ్ళైతే మన దేశం లో మనవారితో వుండాలని భానుమతి అనుకుంటే, అన్ని రకాలుగా  రిచ్ గా అమెరికా లో గడపాలనుకునే వరుణ్ అభిప్రాయానికి బాను ఇష్టపడదు   దీంతో  ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరుగుతాయి. దీంతో ఇద్దరు ఒకరిని ఒకరు ద్వేచించుకునే వరకు వెళ్ళిపోతారు. అయితే వాళ్ళ మధ్య వచ్చిన  మనస్పర్ధలకి నిజమైన కారణం అదేనా? అసలు కారణం ఏమిటి? మరల వరుణ్, భానుమతి ఇద్దరు ఎలా ఒకటయ్యారు? అనేది మిగతా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

మెగా హీరో వరుణ్ క్లాస్ కుర్రాడిగా బాగానే చేశాడు. ఎన్నారై గా వరుణ్ తన డైలాగ్ డెలివరీ అంతా బాగానే చేశాడు. అయితే ఎమోషనల్ సీన్స్ లో మాత్రం ఇంకా పరిణితి చెందాల్సి ఉందనిపిస్తుంది. ఇక భానుమతిగా మలయాళ భామ సాయి పల్లవి అదరగొట్టేసింది. అసలు సినిమా మొత్తం తన కోసమే అన్న విధంగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుంది. తన యాక్టింగ్, డబ్బింగ్, డ్యాన్సింగ్ స్కిల్స్ తో సాయి పల్లవి ప్రేక్షకులను నిజంగానే ఫిదా అయ్యేలా చేసింది. ఈ విషయం లో మేజర్ ప్లస్ గా  ఆమె వంద శాతం మార్కులు కొట్టేసింది. ఇక హీరోయిన్ తండ్రిగా చాలా ఏళ్ల తర్వాత నటించిన సీనియర్ నటుడు సాయిచంద్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. సత్యం రాజేష్ ఎపిసోడ్ పర్వాలేదు. ఇక సినిమాలో మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

సాంకేతికవర్గం పని తీరు :

నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ల  ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాలో ఆద్యంతం కనిపిస్తాయి రెండో హ్యాట్రిక్ సురువు చేసారని చెప్పొచ్చు.  ఇక దర్శకుడుగా శేఖర్ కమ్ముల ఇది వరకు సినిమాలతో పోల్చుకుంటే ఫిదా కాస్తా ప్రత్యేకం అనే చెప్పాలి. అతని స్టైల్ అఫ్ మేకింగ్ చూపిస్తూ, డైలాగ్స్, ఎమోషన్స్ ని చూపించడంలో తన మార్క్ మరల రిపీట్ చేసుకున్నాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ శక్తి కాంత్ అందించిన పాటలు చాలా కాలం పాటు జనాల నోట్లో నానుతూనే ఉంటాయి. అంత బాగా స్వరాలు సమకూర్చారు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అన్ని ఎమోషన్స్ కి తగ్గట్టు అందించి సినిమాకి అదనపు బలం తీసుకోచ్చారు. కెమరామెన్ విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలెట్ గా చెప్పొచ్చు . ఇప్పటి వరకు పల్లెటూరి వాతావారణం అంటే గోదావరి ప్రాంతం అందాలే తెలుగు సినిమాలో కనిపించేవి.  ఇప్పుడు తెలంగాణలో కూడా పల్లెలు కూడా  ఇంత అందంగా ఉంటాయా అనేట్టు చూపించాడు. ఇక అమెరికా అందాలు కూడా తన  కెమెరా తో  బందించి ప్రేక్షకులకి ఆహ్లాదం అందించాడు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ కూడా భాగానే ఉంది. ఇక పాటలు సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అన్ని పాటలు కూడా సాహిత్యం పరంగా భాగా మెప్పించాయి.

విశ్లేషణ :

ఫిదా సినిమా లో  ముఖ్యంగా హీరోయిన్ సాయి పల్లవి తన పెర్ఫార్మెన్స్ తో థియేటర్ లో అందరిని కట్టిపడేసింది. ప్రతి చిన్న ఎమోషన్స్ కి కూడా అద్బుతంగా చూపిస్తూనే, కుటుంబం, ప్రేమ అనే బంధాల మధ్య నలిగిపోయే ఓ మామూలు అమ్మాయి పాత్రలో ఆ సంఘర్షణని భాగా చూపించింది. ఇక ఆమె కామెడీ టైమింగ్, తెలంగాణా యాసలో ఆమె సంభాషణలు పలికే విధానం. డాన్స్ ఇలా అన్నింటా టాప్ అనిపించుకొని సినిమా రేంజ్ ని అమాంతం పెంచేసింది. ఇక సినిమా ఆద్యంతం ప్రేక్షకులని అలా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలోకి తీసుకెళ్ళిపోతుంది. అచ్చం మన ఇంట్లో, మన ఊరిలో ఉన్న ఫీలింగ్ లా ఫస్ట్ ఆఫ్ అంతా ఉంటుంది. కథాపరంగా ఇది  రొటీన్ స్టోరీనే అయినా తెరకెక్కించిన విధానంలో ప్రేక్షకులను ఫిదా చేస్తారు. వరుణ్ తేజ్ ఎన్నారైగా.. సాయి పల్లవి పల్లెటూరి పిల్లలా ఇద్దరిని సినిమాలో శేఖర్ బాగా వాడారని చెప్పొచ్చు. ముఖ్యంగా సాయి పల్లవి మీద అంతా ఫోకస్ పెట్టాడు. మొదటి భాగం అంతా సరదాగా సాగుతుంది.. సెకండ్ హాఫ్ కాస్త ల్యాంగ్ చేసినట్టు అనిపిస్తుంది. మళ్లీ క్లైమాక్స్ లో దాన్ని కవర్ చేశాడు. సినిమా అంతా సాయి పల్లవి ఎనర్జీ సూపర్ గా మెయింటైన్ చేస్తుంది. ముందు చెప్పినట్టుగా కథ పాతదే అయినా సినిమా అంతా సరదాగా నడిపించేశాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. అయితే సెకండ్ హాఫ్ మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే సినిమా ఇంకా బాగా వచ్చేది. సినిమాలో ప్రేక్షకులు నచ్చే అంశాలు బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మంచి మూడ్ క్రియేట్ చేస్తారు. అయితే లీడ్ పెయిర్ మధ్య ఇంకాస్త కెమిస్ట్రీ పెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కాస్త తగ్గినట్టుగా ఉంటాయి. సగటు ప్రేక్షకుడు నచ్చేలా ఉన్న ఈ సినిమా శేఖర్ కమ్ములను.. వరుణ్ తేజ్ ను ఒడ్డున పడేసినట్టే. సినిమాకి పాటలు మరో అదనపు బలం. ఒక్క మాటలో సినిమా గురించి చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చిన అద్బుతమైన ప్రేమ కథ చిత్రం ఫిదా.