రివ్యూ : పాత కథతో, కొత్త కథనం 'DJ దువ్వాడ జగన్నాధం'

23-06-2017

రివ్యూ : పాత కథతో, కొత్త కథనం 'DJ దువ్వాడ జగన్నాధం'

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ 3/5

ప్రొడక్షన్ కంపెనీ: శ్రీ  వెంకటేశ్వర  క్రియేషన్స్,

నటీనటులు : అల్లు అర్జున్, పూజ హెగ్డే, రావు రమేష్, తనికెళ్ళ భరణి, మురళి శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు.

సినిమాటోగ్రఫీ: అయనాంక  బోస్, ఎడిటింగ్ : చోట కే ప్రసాద్, మ్యూజిక్: దేవి శ్రీ  ప్రసాద్,

పాటలు: జొన్న విత్తుల రామలింగేశ్వర రావు, భాస్కర బట్ల, సాహితీ, శ్రీమణి, బాలాజీ, 

స్క్రీన్ ప్లే:రమేష్  రెడ్డి, సతీష్  వేగ్నేశ, నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్,

కథ, మాటలు, దర్శకత్వం: హరీష్  శంకర్,  

విడుదల తేదీ: 23.06.2017

 

'సన్ ఆఫ్ సత్యమూర్తి,‘సరైనోడు’ సినిమాలతో  తనకంటూ ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన తాజా చిత్రమే ‘దువ్వాడ జగన్నాథం’. హరీశ్ శంకర్ డైరెక్షన్లో, దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాపై మొదటి నుండి అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇన్ని అంచనాలు మధ్య ఈరోజే థియేటర్లలోకి వచ్చిన జగన్నాథం అలియాస్ డీజే ఏ మేరకు ఆకట్టుకున్నాడో ఇప్పుడు సమీక్ష లో  చూద్దాం.

కథ:

విజయవాడలోని ఒక అగ్రహారంలో పుట్టిన బ్రాహ్మణ యువకుడే ‘దువ్వాడ జగన్నాథం’(అల్లు అర్జున్). చిన్నప్పటి నుండి సభ్య సమాజంలో జరిగే అన్యాయాలను చూసి తట్టుకోలేని జగన్నాథం వాటిని అణచడానికి ఏదో ఒకటి చెయ్యాలని తపనపడుతూ తన చేతి వంటతో అందరిని మైమరిచోయేలా చేసే డిజె చిన్నప్పటి నుండి ఆవేశపరుడు. అగ్రహారంలో ఉండే దువ్వాడ జగన్నాధం  అన్నపూర్ణ క్యాటరింగ్ నడిపిస్తుంటాడు. అలా తను క్యాటరింగ్ చేస్తున్న ఒక పెళ్ళిలో పూజ (పూజ హెగ్డే)ను చూసి ప్రేమలో కూడా పడతాడు. కానీ ఆమె మాత్రం జగన్నాథాన్ని ప్రేమించదు. ఇక మురళి శర్మతో కలిసి విలన్ల పని పడుతుంటాడు డిజె అండర్ కవర్ ఆపరేషన్ నడిపిస్తున్న డిజెకు సడెన్ గా తనకు బాగా దగ్గరైన మనిషి చంద్రమోహన్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం బాధిస్తుంది. దీనికి కారణం అగ్రి డైమండ్ సంస్థని తెలుసుకుని వారిని టార్గెట్ చేస్తాడు. అగ్రి డైమండ్ సంస్థ రొయ్యల నాయుడు (రావు రమేష్) స్టీఫెన్ బినామిగా నడుపుతూ ఉండాడు. డిజెగా వారి పనిపట్టేందుకు సిద్ధమైన దువ్వాడ జగన్నాధం నాయుడుని ఎలా మట్టుపెట్టాడు అన్నది అసలు కథ. డిజె ఎలా నాయుడు పని పట్టాడు..? హీరోయిన్ పూజా ప్రేమలో డిజె ఎలా పడ్డాడు..? హీరోయిన్ తండ్రికి రొయ్యల నాయుడికి సంబంధం ఏంటన్నది తెర మీద చూడాలి.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

దువ్వాడ జగన్నాధంలో అల్లు అర్జున్ అవుట్ అండ్ అవుట్  స్టైలిష్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మొదటిసారి కెరియర్ లో బ్రాహ్మణ వేశంలో కనిపించిన బన్ని పర్ఫార్మెన్స్ లో మాత్రం అదరగొట్టేశాడు. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివెరీలో కూడా ప్రత్యేకతను చూపాడు. బన్ని సినిమాలో డ్యాన్స్ లో వావ్ ఫ్యాక్టర్ ఉండాల్సిందే. ప్రతి సాంగ్ లో తన స్టాంప్ వేసుకున్నాడు బన్ని. ఇక హీరోయిన్ పూజా హెగ్దె సినిమాలో గ్లామర్ షో చేసింది. బన్నీ, పూజ హెగ్డేల మధ్య నడిచే లవ్ ట్రాక్ రొమాంటిక్ గా ఉంది. పూజ హెగ్డేకు నటన కనబర్చే ఛాన్స్ పెద్దగా లేకపోయినా అందంతో గిలిగింతలు పెడుతూ మళ్ళీ ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అనుకునేలా చేసింది. సినిమాకు పూజా గ్లామర్ చాలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఇక విలన్ గా రావు రమేష్ తన తండ్రి రావు గోపాల రావు ఆ ఒక్కటి అడక్కు సినిమా తరహా పాత్రలో విలన్ గా నటించిన రావు రమేష్ రొయ్యల నాయుడిగా కనిపిస్తూ వేషంలోనూ, భాషలోనూ ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో తన తండ్రి రావు గోపాల్ రావ్ చేసిన రొయ్యల నాయుడి పాత్రను గుర్తు చేశారు. మురళిశర్మ, తణికెళ్ల భరణిల పాత్రలు బాగా వచ్చాయి. వెన్నెల కిశోర్ కామెడీ బాగుంది. సుబ్బరాజు పాత్ర కూడా అలరించింది.

సాంకేతికవర్గం :

దర్శకుడు హరీశ్ శంకర్ ఎంచుకున్నది రోటీన్ కథే అయినా తెలివిగా అందులో దువ్వాడ జగన్నాథం అనే ప్రత్యేక పాత్రను ఇన్వాల్వ్ చేసి సినిమా మొదటి అర్థ భాగాన్ని చాలా బలంగా, ఎంటర్టైనింగా తయారుచేశారు. ఇక ఆ పాత్ర చేసిన అల్లు అర్జున్ కూడా స్తోత్రాలు, మంత్రాలు చెబుతూ ఒక అచ్చమైన బ్రాహ్మణుడి బాడీ లాంగ్వేజ్, మాట తీరుతో ఎలాంటి లోటు లేకుండా రాణించి పాత్రకు ప్రాణం పోసి డైలాగ్స్ విషయంలో హరిష్ తన పనితనం చూపించాడు. టెక్నికల్ గా డిజె సినిమా బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. బోస్ సినిమాటోఫ్రఫీ బాగుంది. బన్నిని చాలా స్టైలిష్ గా చూపించారు. పూజా హెగ్దె అయితే సినిమాతో కచ్చితంగా మంచి మార్కులు కొట్టేస్తుంది. ఇక చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు హైలెట్.. దేవి మ్యూజిక్ కు బన్ని డ్యాన్సులు అదరహో అనిపిస్తాయి.  తన మార్క్ సినిమాతో వచ్చాదు.  దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

విశ్లేషణ:

హరీశ్ శంకర్ హ్యూమర్, బన్నీ పెర్ఫార్మెన్స్ కలిసి ఫస్టాఫ్ ను నిలబెట్టేశాయి. ఇక హరీశ్ శంకర్ అయితే హీరోను గుడి గోపురం మీద పరిచయం చేసి, హీరోయిన్ ను మొదటి షాట్లోనే గ్లామరస్ గా చూపించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అంతేగాక జగన్నాథం పాత్రలో ద్వారా మంచి కామెడీని జనరేట్ చేసి పలుసార్లు నవ్వుకునేలా చేశాడు. సినిమా ముగింపును కూడా రొటీన్ గా కాకుండా కొంచెం భిన్నంగా ట్రై చేసిన హరీశ్ శంకర్ ప్రయత్నం మెచ్చుకోదగిన అంశం. బన్ని విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మార్కులు పడ్డట్టే. అయితే పాత కథకి హీరో క్యారక్టరైజేషన్ కాస్త కొత్తగా రాసుకుని డిజెగా వదిలాడు హరిష్ శంకర్. కథ పాతదే అన్న భావన కలుగుతుంది. స్క్రీన్ ప్లే కూడా అంత ఎట్రాక్టివ్ గా ఉండదు. 

సినిమా మొదటి భాగం అంతా కామెడీతో నడిపించిన హరిష్ శంకర్ ఇక సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ తో నింపాడు. అక్కడక్కడ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. సినిమాలో బన్ని ఎనర్జీ.. ముఖ్యంగా అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ మాత్రం అదుర్స్ అనిపిస్తాయి. కథ రొటీన్ అయినా కథనం మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. సినిమా అయితే మిక్సెడ్ రెస్పాన్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. సినిమ సరదాగా సాగినా సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ కాస్త ఎక్కువైనట్టు అనిపిస్తాయి. ఇక కొత్తగా ఏం చెప్పదలచుకున్నాడు అన్న పాయింట్ ఆడియెన్స్ ఆలోచిస్తే మాత్రం కష్టమే. మొత్తం మీద చెప్పాలంటే ఈ సినిమా నటుడిగా అల్లు అర్జున్ కు మంచి పేరు తేవడమే కాకుండా ఆయన కెరీర్లోని మంచి సినిమాల్లో ఒకటిగా కూడా నిలుస్తుంది. మెగా అభిమానులకు మంచి ఫీస్ట్ అందించే సినిమాగా మాస్ క్లాస్ మికెస్ తో వచ్చింది డిజె. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు కచ్చితంగా నచ్చే సినిమా అవుతుందని చెప్పొచ్చు.