YS Jagan Praja Sankalpa Yatra in Nellore

ఈ సందర్భంగా అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ వైయస్ జగన్. ప్రసంగంలోని ముఖ్యాంశాలు.

- నెల్లూరులో విక్రమ సింహపురి యూనివర్శిటీ కనిపిస్తుంది.  నెల్లూరులో 2008కి ముందు విశ్వవిద్యాలయం లేదు. ఇక్కడ పిల్లలు బాగా చదవాలని నాన్నగారు విక్రమ సింహపురి యూనివర్శిటీని 2008లో స్థాపించారు. 

- విక్రమసింహపురి యూనివర్శిటీ పరిస్థితి చూస్తే బాబు పాలన ఎలా ఉందో అర్థమవుతోంది. నాన్ టీచింగ్ పోస్టులు 200 ఖాళీగా ఉన్నా పిల్లలకు మేలు జరుగుతుందని తెల్సినా పట్టించుకునే పరిస్థితి లేదు. పోస్టులు నిబంధనలకు విరుద్ధంగా తీసుకుంటున్నారు. అర్హులకు అర్హత లేకుండా చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు తొలగిస్తున్నారు. యూనివర్శిటీ కాంట్రాక్టు ఉద్యోగులు కోర్టుకు వెళ్లి పోరాడుతున్నారు. ఇది కేవలం ఇక్కడ మాత్రమే కాదని.. రాష్ట్రమంతా కనిపిస్తోందన్నారు. 

- ఆనాడు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఈరోజు ఉన్నజాబు ఉండాలంటే బాబు పోవాలంటున్నారు. 

- నాన్నగారి హయాంలో ఈ ఊరులో జూనియర్ కాలేజీ కావాలని అడిగితే వెంటనే ఈ గ్రామంలో (సౌత్ మోపూరు) జూనియర్ కాలేజీ మంజూరు చేశారు. 

- నెల్లూరులో 15 గ్రామాలు కలిపి.. ఆ గ్రామాల్లో డ్రైనేజీ, సాగునీటి సౌకర్యాలు కల్పించాలని అనుకుంటారు. హడ్కో నుంచి రూ.1100 కోట్లు రుణాలు తెస్తారు. ఈ గ్రామాల్లో మాత్రం ఎలాంటి సౌకర్యాలు లేకపోగా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. 

రేపు హడ్కో రుణాల వల్ల ఇంటిపన్నులు వాయించేస్తారని హెచ్చరించిన శ్రీవైయస్ జగన్. 

నెల్లూరు బ్యారేజీ వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని 80 శాతం ఆధునీకరణ పనులు వైయస్ హయాంలో పూర్తైతే, 20 శాతం పనులు ఇప్పటి వరకు చేయలేదు. 

- నెల్లూరు రూరల్ ఆటోనగర్ లో కార్మికులకు తాగు నీరు, రాకపోకలకు రోడ్లు లేవన్నారు. 

- ఈ ప్రాంత సమస్యల మీద ప్రభుత్వం చిత్తశుద్ధి లేదన్నారు. పేదవాడి గురించి ఎవరైనా మంచిగా ఆలోచిస్తారు. అవినీతి డబ్బులు పేదవాడి నుంచి గుంజుకోవాలని ఏ రాజకీయ నాయకుడు ఆలోచించడు. అలాంటి దిక్కుమాలిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబే అని మండిపడ్డ శ్రీ వైయస్ జగన్. 

- 300 అడుగుల ప్లాట్ ను పేదవాడికి 6లక్షలకు అమ్ముతున్నారని తెలిపిన శ్రీ వైయస్ జగన్. 

- ఈ అపార్ట్ మెంట్ లో ప్లాట్ 6 లక్షలు అమ్మటంపై ఆశ్చర్యపోయిన శ్రీ వైయస్ జగన్. 

- పేద‌వాళ్ల‌కు క‌ట్టించే ఇళ్ల‌లో స్కాంకు చంద్ర‌బాబు తెర‌లేపారు

- లక్షన్నర కేంద్రం, లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ.. మూడు లక్షలు 20 ఏళ్ల పాటు పేదవాడు కట్టడంపై మండిపడ్డ శ్రీ వైయస్ జగన్. 

ఒళ్లు తెలియ‌కుండా ప‌రిపాల‌న సాగించే చంద్ర‌బాబు మ‌న‌కు అవ‌స‌ర‌మా ? 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే పెట్రోల్ ధ‌ర‌లు అధికం

 మ‌న రాష్ట్రంలో క‌న్నా క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడులో పెట్రోల్ ధ‌ర‌లు త‌క్కువ‌

- లీటరు పెట్రోల్, డీజిల్ ఖరీదు ఏపీ కంటే తమిళనాడు బోర్డర్ లో రూ.7లు తక్కువ. కర్నాటకలో అయితే రూ.6లు తక్కువకే పోస్తారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రేట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. నాలుగేళ్ల నుంచి ప్రజల నుంచి చంద్రబాబు పెట్రో పన్ను వసూలు చేశారు. 

- యువ‌కులు మ‌ద్యం తాగి చెడిపోతార‌న్న చంద్ర‌బాబు ఇప్పుడు ఫోన్ కొడితే మ‌ద్యం అందిస్తున్నారు

- ఫోన్ కొడితే నీళ్లు వ‌స్తాయో రావో తెలియ‌దుకాని, మ‌ద్యం మాత్రం చంద్ర‌బాబు పాల‌న‌లో వస్తోంది. 

- ఎన్నికలప్పుడు కరెంటు బిల్లులు తగ్గిస్తానని చంద్రబాబు ప్రకటనలు ఇచ్చారన్నారు. - నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు కరెంటు బిల్లులు ఎంత వచ్చేవి. 

- రేషన్ షాపుల్లో ఇప్పుడు బియ్యం తప్ప ఏమీ ఇవ్వటం లేదు. వైయస్ హయాంలో రూ.180లకే 13 రకాల నిత్యావసర వస్తువులు అందించేవారు. 

- ఇంట్లో ఆరు మంది ఉంటే.. ఇద్దరికి వేలిముద్రలు పడటం లేదంటూ కటింగ్.. చేస్తున్నారు. 

- ఆర్టీసీ బస్సులు ఎక్కాలంటే భయపడే పరిస్థితి తెచ్చారు. పండగలప్పుడు భారీగా ఛార్జీల మోత మోగిస్తున్నారు. 

- బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. 

- వ్యవసాయ రుణాలు బేషరుతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. మరి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? కానీ, బ్యాంకుల వాళ్లు పంపిస్తున్న వేలం నోటీసులు వస్తున్నాయి. 

- వ్యవసాయ రుణాల మాఫీ కార్యక్రమంలో వడ్డీకి సరిపోవటం లేదు. 

- జాబు రావాలంటే.. బాబు రావాలన్నారు. ప్రతి ఇంటికీ మనిషిని పంపారు. పాంప్లేట్ మీద చంద్రబాబు సంతకం పెట్టారని చెప్పారు. ప్రతి ఇంటికీ జాబు అన్నా, ఉపాధి ఇస్తారు. లేకపోతే రూ.2వేలు ఇస్తామన్నారు. 45 నెలల చొప్పన లెక్కేస్తే ప్రతి ఇంటికీ రూ.90వేలు చంద్రబాబు బాకీ పడ్డారు. 

- ఆడవాళ్లు కన్నీళ్లు పెడతే ఇంటికీ అరిష్టం. కానీ చంద్రబాబు ఆడవాళ్లను మోసం చేశారు. పొదుపు సంఘల అక్కచెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ కావాలంటే.. బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. మరి, నాలుగేళ్ల తర్వాత అడుగుతున్నా.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా అని ప్రశ్నించిన శ్రీ వైయస్ జగన్. 

- డ్వాక్రా సంఘాల తరుపున ప్రభుత్వాలు  బ్యాంకులకు వడ్డీలు కట్టేవి. దీంతో డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు వచ్చేవి. బాబు వచ్చాక వడ్డీలు కట్టడం మానేశారు. 

- చంద్రబాబు పాలన గురించి చెప్పుకుంటూ పోతే గంటల కొద్దీ పడుతుంది. ఇంత దారుణమైన పాలన ఎక్కడా లేదు.  

- చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చాలా బాధపడ్డారట. మంత్రులు, ఎంపీలతో ఫోన్ చేసి మాట్లాడారట. టీవీలు, పేపర్లకు లీకులు ఇచ్చుకోవటం ఏమిటి అని ఎద్దేవా చేసిన శ్రీ వైయస్ జగన్. 

బీజేపీ వాళ్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం 5వసారి. బడ్జెట్ ప్రవేశపెట్టేది ఎన్డీయే ప్రభుత్వం. వీళ్లందరి ఆమోదం తెలిపిన తర్వాతే బడ్జెట్ ప్రవేశపెడితే.. ఈ రోజు చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు. చంద్రబాబుకు తెలీయకుండా జరిగిందా? 

మూడు సంవత్సరాల 11 నెలల పాటు ఏనాడూ బీజేపీని, మోడీని తిట్టలేదు. రాష్ట్రానికి విపరీతంగా చేసేశారని చంద్రబాబు పొగిడారు. గత రెండు రోజులుగా మోడీ మోసం చేశారని చంద్రబాబు అనటం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ప్రత్యేక హోదా ఎందుకు వదిలేశావని అడిగితే.. కోడలు మగబిడ్డను కంటావంటే అత్త వద్దంటుందా అని చంద్రబాబు అన్నారు. మొన్నటి దాకా 3 సంవత్సరాల 11 నెలల పాటు ఇదే మాట చంద్రబాబు చెప్పుకొచ్చారన్నారు. ఇదంతా ఎవరో ఒకరి మీద మోపాలని.. మోడీపైనే మోపారన్నారు. అధికారం కోసం, పదవుల కోసం కూతుర్ని ఇచ్చిన సొంత మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడవగా లేనిది.. ప్రజలు ఓ లెక్కనా? మోడీ ఓ లెక్కనా? 

చంద్రబాబు బడ్జెట్ చూసి చాలా బాధపడ్డావు అన్నారంటే.. నీ అంత అన్యాయస్తుడు ఎవరు ఉండరు. చంద్రబాబు దగ్గర ఉండి రాష్ట్రానికి రావాల్సినవి రాకుండా చేశాడు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా సంజీవని అన్నారు. 10 సంవత్సరాలు కాదు.. 15 ఏళ్లు తెస్తామన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదా సంజీవనా అని మనల్ని అడగటం మొదలుపెట్టాడు. నిజంగా ప్రత్యేక హోదాను చంద్రబాబే ఖూనీ చేశారు. 

రాష్ట్రంలో సమ్మిట్ లు పెట్టారు యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయని అబద్ధాలు చెబుతున్నారు. రెండేళ్లలో 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఊదరగొట్టడంపై శ్రీ వైయస్ జగన్ మండిపాటు. డీఐపీపీ దగ్గర ఐఈఎం లెక్కలు చూస్తే.. 2015 నాటికి రూ.4,500 కోట్లు. 2016 డిసెంబరు నాటికి రూ.10వేల కోట్లు 2017 డిసెంబరు నాటికి రూ.4400 కోట్లు పెట్టుబడులు వచ్చాయని కేంద్రం ప్రభుత్వ సంస్థల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

- చంద్రబాబు నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకోవటానికి విదేశాలు వెళ్తున్నారని శ్రీ వైయస్ జగన్ అన్నారు. చంద్రబాబు విదేశాలు వెళ్తే.. పచ్చ పత్రికలు అదిగో... మైక్రోసాఫ్ట్, ఇదిగో.. ఎయిర్ బస్, బుల్లెట్ ట్రైన్ వస్తున్నాయంటూ కథనాలు రాస్తున్నాయన్నారు. 

- మన్నవరం ప్రాజెక్టుకు గతిలేదు కానీ ఎయిర్ బస్, బుల్లెట్ ట్రైన్, ఎయిర్ బస్ అంటూ.. చెవిలో పువ్వులు పెట్టేస్తున్నారన్నారు. 

దుగ్గరాజపట్నం పోర్టు వస్తే చెన్నై, ఎన్నూర్ పోర్టుల్లా.. నెల్లూరు కూడా మారిపోతుందన్నారు.అయితే, -దుగరాజపట్నం అవసరం లేదంటూ.. మోడీ దగ్గరకు వెళ్లి చంద్రబాబు లేఖ ఇచ్చారు. 

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితే చంద్రబాబు బాధపడ్డారు. నువ్వు లేఖ ఇస్తే కదా.. వారు ఇవ్వకుండా పోయింది. 

- భోగాపురం ఎయిర్ పోర్టుకు టెండర్లు పిలిస్తే.. 30శాతం వాటా ఇస్తామని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా చెబితే, ప్రైవేటు సంస్థ జీఎంఆర్ 20శాతం ఇస్తామంది. దీంతో లంచాల కోసం భోగాపురం ఎయిర్ పోర్టును రద్దు చేశారు. అశోకగజపతిరాజు చంద్రబాబుకు లంచాలు ఇప్పించే పనిలో ఉన్నారన్న చంద్రబాబు. 

- కాంట్రాక్టర్ల దగ్గర లంచాల తీసుకోవటానికి పోలవరం తీసుకున్నారు. 

- ఇలాంటి మోసం చేసే వ్యక్తి నాయకుడిగా ఎంచుకోవాలా అని ప్రశ్నించిన శ్రీ వైయస్ జగన్. 

- ఎన్నికలప్పుడు చంద్రబాబు ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామంటారు. 

- ప్రతి ఇంటికీ ప్రతి ఓటుకు రూ.3వేలు ఇస్తారు. డబ్బులు చేతిలో పెడితే తీసుకోండి. మన డబ్బే. ప్రజల సొమ్ము కత్తిరించి ఆయన జేబులు నింపుకున్నారు. ఓటు వేసేటప్పుడు మాత్రం.. మీ మనస్సాక్షి ప్రకారం వేయండి. అబద్దాలు చెప్పేవారికి ఓటేయవద్దు. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి.. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. నవరత్నాలు అమలు చేస్తాం.

Click here for Photogallery