బ్రిక్స్ సదస్సుకు హాజరుకానున్న నరేంద్ర మోదీ

03-09-2017

బ్రిక్స్ సదస్సుకు హాజరుకానున్న నరేంద్ర మోదీ

బ్రిక్స్‌ సదస్సు కోసం నేడు చైనాకు బయల్దేరి వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్‌ దేశాల సదస్సు నుంచి ఫలవంతమైన చర్చలు, సానుకూల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ‘గోవా బ్రిక్స్‌ సదస్సు ద్వారా సాధించిన ఫలితాలు తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాను. శాంతి, భద్రత, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంలో బ్రిక్స్‌ కూటమి ముఖ్య భూమిక పోషించింది’ అని ప్రధాని అన్నారు.