బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఇండియా

02-09-2017

బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఇండియా

ఎయిర్‌ ఇండియా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. దేశీయ విమానాల్లో ఎకనామీ తరగతి టికెట్లపై 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఆఫర్‌ సైనికులు, సీనియర్‌ సిటిజన్స్‌, విద్యార్థులకు వర్తించనున్నట్లు తెలిపింది.ఈ అవకాశాన్ని పొందాలంటే ప్రయాణానికి ఏడు రోజుల ముందుగానే టికెట్‌ బుక్‌ చేసుకోవాలి. ఈ మేరకు ఎయిర్‌ఇండియా ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. అయితే ఈ ఆఫర్‌ ఎప్పటి వరకు ఉంటుందనేది ఎయిర్‌ఇండియా తెలపలేదు. ఎయిర్‌ ఇండియా అధికార వెబ్‌సైట్‌, కార్యాలయాల్లో టికెట్లను పొందవచ్చు. అలాగే ఈ ఆఫర్‌ లో 25 కేజీల చెక్‌ ఇన్‌బ్యాగేజీ కూడా ఉచితమని తెలిపింది.