CM YS Jagan Launches Guru Smarana Book

ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍మోహన్‍ రెడ్డి గురు స్మరణలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సీనియర్‍ పాత్రికేయుడు బూదరాజు రాధాకృష్ణ 88వ జయంతి సందర్భంగా ఆయన శిష్య బృందం రూపొందించిన కవితా సంకలనం గురు స్మరణలో పుస్తకాన్ని సీఎం జగన్‍ క్యాంప్‍ కార్యాలయంలోని తన ఛాంబర్‍లో ఆవిష్కరణ చేశారు. పత్రికా రంగానికి, తెలుగు భాషకు బూదరాజు సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కమ్యూనికేషన్స్ సలహాదారు జీవీడీ కృష్ణ మోహన్‍ పాల్గొన్నారు.