శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

25-03-2020

శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

తెలుగు నూతన సంవత్సరాది సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని అర్చకులు, అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొన్ని దశాబ్దాలుగా భక్తుల కోలాహలం మధ్య ఎంతో వైభవంగా జరిగే ఈ వేడుక.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి అతి కొద్ది మందితో సాధారణంగా పూర్తయ్యింది. ఆలయ గోపురాలు, ప్రాకారాలను సైతం తిరుమల తిరుపతి దేవస్థానం సాధారణంగా అలంకరించింది. వేదపండితులు శ్రీవారికి శ్రీశార్వరి నామ ఉగాది పంచాంగాన్ని పఠించి, నివేదించారు. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు ఆస్థాన క్రతువు పూర్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు, సిబ్బంది పరిమిత సంఖ్యలో పాల్గొన్నారు.