ఏపీఎన్ఆర్టీ కాల్‍ సెంటర్‍కు 800పైగా ఫోన్ కాల్స్

ఏపీఎన్ఆర్టీ కాల్‍ సెంటర్‍కు 800పైగా ఫోన్ కాల్స్

25-03-2020

ఏపీఎన్ఆర్టీ కాల్‍ సెంటర్‍కు 800పైగా ఫోన్ కాల్స్

ఆంధప్రదేశ్‍ నాన్‍ రెసిడెంట్‍ తెలుగు సొసైటీ (ఏపీఎన్‍ఆర్టీ) ఎన్నారై కాల్‍ సెంటర్‍కు ప్రవాసాంధ్రులు, వివిధ జిల్లాల ప్రజల నుంచి ఇప్పటివరకు 800కు పైగా ఫోన్‍ కాల్స్ వచ్చినట్లు ఆ సంస్థ అధ్యక్షుడు మేడపాటి వెంకట్‍ తెలిపారు. కేంద్ర ప్రయాణ నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత విదేశాల్లో ఉన్న ప్రయాణికులందరికీ భరోసానిస్తూ ప్రయాణ విధానాలు, విమానాల ఆపరేషన్స్ను వివరించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఢిల్లీలోని ఏపీ కంట్రోల్‍ సెల్‍తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.