మోడీ కేబినెట్‌ సమావేశంలో సోషల్‌ డిస్టెన్స్‌

మోడీ కేబినెట్‌ సమావేశంలో సోషల్‌ డిస్టెన్స్‌

25-03-2020

మోడీ కేబినెట్‌ సమావేశంలో సోషల్‌ డిస్టెన్స్‌

 ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కరోనా నేపథ్యంలో కేబినెట్‌ సమావేశంలో సోషల్‌ డిస్టెన్స్‌ పాటించారు.సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు దూరం దూరంగా కూర్చున్నారు. కుర్చీ కుర్చీకి మధ్య మూడు అడుగుల దూరం పాటించారు.  

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర కేబినెట్‌ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టిందని కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ వెల్లడించారు.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో కార్మికులకు ఆయా సంస్థలు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. మహమ్మారికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా త్వరలో జిల్లాల వారీగా హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలో నిత్యావసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.