చంద్రబాబు ముందస్తు అరెస్టు

చంద్రబాబు ముందస్తు అరెస్టు

27-02-2020

చంద్రబాబు ముందస్తు అరెస్టు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని విశాఖ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. విశాఖ వెస్ట్జోన్‍ ఏసీపీ పేరుతో సెక్షన్‍ 151 కింద ఆయనకు పోలీసులు నోటీసు ఇచ్చారు. భద్రత దృష్ట్యా ముందస్తుగా అరెస్టు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అనంతరం తీవ్ర ఉద్రికత్త నడుమ ఆయన్ను అదుపులోకి తీసుకుని తిరిగి విశాఖ విమానాశ్రయంలోనికి తరలించారు. అక్కడ వీఐపీ లాంజ్‍లో ఆయన్ను ఉంచారు. వీఐపీ లాంజ్‍లో సుమారు అరగంటసేపు ఉంచే వీలుంది. ఆ తర్వాత చంద్రబాబును విమానాశ్రయం నుంచి విజయవాడ లేదా హైదరాబాద్‍ పంపిస్తారా? విశాఖలోనే ఇతర ప్రాంతానికి తరలిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.