విశాఖకు పులివెందుల సంప్రదాయం : వర్ల

విశాఖకు పులివెందుల సంప్రదాయం : వర్ల

27-02-2020

విశాఖకు పులివెందుల సంప్రదాయం : వర్ల

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకునేందుకు ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చి తీసుకొచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. వైకాపా నాయకులు తీసుకొచ్చిన పెయిడ్‍ ఆర్టిస్టులు చంద్రబాబు కాన్వాయ్‍పై కోడిగుడ్లు, టమాటలతో దాడి చేశారని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కాన్వాయ్‍పై దాడికి పాల్పడటం హేయమైన చర్య అన్నారు. భవిష్యత్తును తలచుకుంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్‍ క్యాపిటల్‍ సినిమాకు జగన్‍ ట్రైలర్‍ మాత్రమే ఇవాళ చూశారు. విశాఖలో జగన్‍ పాలన ప్రారంభమైతే ఆ సినిమా ఇంఎలా ఉంటుందో గ్రహించాలి. చంద్రబాబు పర్యటనను 10 రోజుల ముందే ప్రకటిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అడ్డుకుంటామని మంత్రులే ప్రకటిస్తే వారిని ఎందుకు అరెస్టు చేయలేదు. ప్రశాంతంగా ఉండే విశాఖకు పులివెందుల సంప్రదాయం తీసుకుకొస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు పసుపు చీరలు ••ట్టుకున్న వైకాపా కార్యకర్తల వీడియోలను విడుదల చేశారు.