ఏపీలో కొత్త పారిశ్రామిక పాలసీ...

ఏపీలో కొత్త పారిశ్రామిక పాలసీ...

27-02-2020

ఏపీలో కొత్త పారిశ్రామిక పాలసీ...

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక పాలసీని సిద్దం చేశామని మంత్రి మేకపాటి గౌతమ్‍ రెడ్డి వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చిలో కొత్త పాలసీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో వదిలేసిన పరిశ్రమలను కూడా తెస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చేందుకు మంచి పాలసీని రూపొందించారని తెలిపారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని పట్టించుకునేది లేదన్నారు. ప్రభుత్వం తమకు సహకరిస్తుందని కియో మోటర్స్ చాలా సృష్టంగా చెప్పిందని ఆయన వివరించారు.