రూ.2 వేల నోటుపై కీలక ప్రకటన

రూ.2 వేల నోటుపై కీలక ప్రకటన

27-02-2020

రూ.2 వేల నోటుపై కీలక ప్రకటన

రూ.2వేల నోటు కనుమరుగు కానుందన్న వార్తలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‍ స్పందించారు. రూ.2వేల నోట్ల జారీని నిలిపివేయాల్సిందిగా బ్యాంకులకు తాము ఎలాంటి ఆదేశాలివ్వలేదని ఆమె సృష్టం చేశారు. వివిధ ప్రభుత్వ బ్యాంకుల కీలక అధికారులతో సమావేశమైన నిర్మలా సీతారామన్‍ ఈ వివరణ ఇచ్చారు. తనకు తెలిసినంతవరకు, బ్యాంకులకు అలాంటి సూచనలేవీ ఇవ్వలేదంటూ తాజా పుకార్లను కొట్టి పారేశారు. 2 వేల రూపాయల విలువైన నోట్లు చట్టబద్ధంగా చలామణిలో వుంటాయని, ఈ విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదని, పుకార్లను నమ్మవద్దని సూచించారు.