Telangana CS Somesh Kumar Review Meeting

ఘనవ్యర్ధాల నిర్వహణ నియమాల అమలు, బయోమెడికల్ వేస్ట్ , నది ప్రవాహాలలో కాలుష్యం, STP ల నిర్మాణం, వ్యర్థజలాల శుద్దీకరణ తదితర ఆంశాలపై  National Green Tribunal కి సమర్పించవలసిన నివేదికను  జనవరి 31 నాటికి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
 
సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో NGT సమావేశంలో చర్చకు వచ్చే అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
 
ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్ , పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి శ్రీ వికాస్ రాజ్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా , మెట్రో వాటర్ వర్క్స యం.డి శ్రీ దానకిషోర్ , పి.సి.బి. సభ్య కార్యదర్శి శ్రీమతి నీతూ ప్రసాద్, TSIIC MD వెంకట నర్సింహా రెడ్డి ల తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ National Green Tribunal సమర్పించవలసిన నివేదికలో, ఇప్పటి వరకు సాధించిన పురోగతి ని పొందుపరుచాలన్నారు. 
 
మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్ మాట్లాడుతూ National Green Tribunal ఉత్తర్వుల ప్రకారం time bound action plan అమలు కు తీసుకుంటున్న చర్యలను వివరించారు. గ్రామ పంచాయతీలలో పారిశుద్ద కార్యక్రమాలు, చెత్త సేకరణ తీరును ముఖ్య కార్యదర్శి శ్రీ వికాస్ రాజ్ వివరించారు.