Malladi Vishnu Appointed AP Brahmin Corporation Chairman

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి లభించింది. ఏపీ బ్రహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మల్లాది విష్ణును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా ఈ పదవిలో విష్ణు రెండేళ్ల పాటు కొనసాగుతారు. మల్లాది విష్ణును బ్రహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించడంతో ఆయన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు.