TDP MP Galla Jayadev Press Meet

అరెస్టులతో అమరావతి ఉద్యమం ఆగదని ఎంపీ గల్లా జయదేవ్‌ సృష్టం చేశారు. మీడియాపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న 14 మంది రాజధాని రైతులు ఇవాళ విడుదలయ్యారు. వారికి గల్లా జయదేవ్‌ జైలు వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారులు మాటలకే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప రాజ్యాంగాన్ని, చట్టాలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. తీవ్రవాదులతో వ్యవహరించినట్లు రైతులతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో మహిళలపై జరిగిన దాడిని కేంద్ర మహిళ కమిషన్‌కు వివరిస్తానమి తెలిపారు. పోలీసుల అణచివేత చర్యలు తమను ఆపలేవని రాజధాని రైతులు సృష్టం చేశారు. వైకాపాకి ఓటు వేసినందుకు ఇది ఫలితం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.