Venkaiah Naidu Responded On AP Disha Act

దిశ యాక్ట్‌ ను తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై వేగంగా విచారణ జరపడానికి చట్టం సమర్థవంతంగా అమలైతే అత్యాచార బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు అవసరం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను అని వెంకయ్య నాయుడు ట్విట్టర్‌ లో పేర్కొన్నారు.