harish rao to attend central budget meeting in delhi

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ కూర్పుపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ప్రాథమిక చర్చల కోసం ఈ నెల 18న ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ.. దానికి అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులను ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకూ ఆహ్వానం అందింది. రానున్న బడ్జెట్‌ కోసం సూచనలు, సలహాలూ ఈ సమావేశంలో ఇవ్వాలంటూ కేంద్రం ఆహ్వానంలో పేర్కొంది. ఈ సమావేశం తర్వాత జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశమూ జరగనుంది.