Is Rahul Gandhi returning as Congress President

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్‌ గాంధీ మళ్లీ చేపట్టవచ్చని తెలుస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాహుల్‌ అంతరంగిక బృంద సభ్యుడు కేసీ వేణుగోపాల్‌ ఈ విషయాన్ని సంకేతప్రాయంగా చెప్పారు. మళ్లీ పగ్గాలు చేపట్టడం ప్రస్తుత పరిస్థితుల్లో అనివార్యం. నేతలు, కార్యకర్తల మనోభావాలను ఆయన అంగీకరిస్తారు. ఈ ఏడాది జూలైలో ఆయన నిష్క్రమణ భావోద్వేగంతో కూడుకున్నది. దేశం క్లిష్ట దశలో ఉంది. పార్టీకి ఆయన నాయకత్వం అవసరం అని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెలలో ఏఐసీసీ విస్తృత సమావేశం జరుగుతుందని, అందులో రాహుల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని మరో నేత చెప్పారు.