దిశ ఘటనపై కేంద్ర కీలక ప్రకటన

02-12-2019

దిశ ఘటనపై కేంద్ర కీలక ప్రకటన

షాద్‌నగర్‌లో వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనను పార్టీలకతీతంగా ఎంపీలంతా లోక్‌సభ సాక్షిగా ముక్తకంఠంతో ఖండించారు. దిశ ఘటనను పార్టీలకతీతంగా ఖండించాలని లోక్‌సభలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అన్ని పార్టీలు అంగీకరిస్తే చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమని రాజ్‌నాథ్‌ ప్రకటించారు.