2024 లోపు వారందరినీ పంపించేస్తాం

02-12-2019

2024 లోపు వారందరినీ పంపించేస్తాం

దేశంలో అక్రమంగా నివసిస్తున్న చొరబాటు దారులందరినీ 2024లోపు సరిహద్దు బయటికి పంపించేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. జార్ఖండ్‌లో నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సీని దేశం మొత్తం అమలు చేస్తామని, చొరబాటులను అణచివేస్తామని చెప్పారు. అంతే కాకుండా చొరబాటు దారులపై రాహుల్‌ గాంధీ ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. ఈ దేశం నుంచి జార్ఖండ్‌ నుంచి చొరబాటు దారుల అందరినీ పంపించేస్తాం. కానీ, రాహుల్‌ బాబాకు ఇది ఇష్టం లేదు. వాళ్లు ఎక్కడికి వెళ్తారు? ఏం తింటారు? అని అడుగుతున్నారు. కానీ, నేను మీకు హామీ ఇస్తున్నాను. 2014 లోపు క్రమక్రమంగా దేశంలోని చొరబాటు దారులందరినీ సరిహద్దు బయటకు పంపించేస్తాం అని అన్నారు.