ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు

02-12-2019

ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కార్మికులపై ముఖ్యమంత్రి కెసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని 97 డిపోల నుంచి డిపోకు ఐదురుగు చొప్పున ఎంపిక చేసిన కార్మికులతో ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించారు. కార్మికులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం రెండు గంటలపాటు వారితో ఆత్మీయంగా మాట్లాడి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. ఆర్టీసీలో ఒక్క ఉద్యోగినీ ఉద్యోగంలోంచి తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఏ ఒక్క రూటులోనూ ఒక్క ప్రైవేటు బస్సుకూ అనుమతి ఇవ్వబోమని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఏటా బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. సెప్టెంబ్‌ నెల జీతాన్ని నేడే అందిస్తామని, సమ్మె కాలానికి సంబంధించిన వేతనాన్ని ఏకమొత్తంలో అందిస్తామని హామీ ఇచ్చారు.

ఆర్టీసీ ఉద్యోగుల పదవీవిరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. సమ్మె కాలంలో చనిపోయిఒన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇస్తామన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామన్నారు.