లఘు చిత్రానికి జాతీయ పురస్కారం

02-12-2019

లఘు చిత్రానికి జాతీయ పురస్కారం

కాలుష్య అంశంపై కేంద్ర పర్యావరణ అటవీ, వాతావరణ మార్పుల శాఖ, సీఎంఎస్‌ వాతావరణ్‌లు సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు రూపొందించిన లఘు చిత్రానికి ద్వితియ స్థానం దక్కింది. నిర్మాత సునీల్‌ సత్యవోలు, దర్శకుడు అన్షుల్‌ సిన్హాలకు కేంద్ర పర్యావరణ అటవీ, వాతావరణ మార్పుల శాఖ అదనపు కార్యదర్శి రవి అగర్వాల్‌ ట్రోపీ, రూ. లక్ష నగదు, ధ్రువపత్రంం అందజేశారు.అనంతరం నునీల్‌ మీడియాతో మాట్లాడుతూ 2.30 నిమిషాల నిడివిగల ప్రతి చెరువుకి స్వరం ఉంటుంది అని తాము తీసిన లఘు చిత్రానికి ఈ పురస్కారం దక్కిందన్నారు. ఈ లఘు చిత్రం ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పలు అవార్డులు తీసుకొచ్చిందన్నారు.