JC Diwakar Reddy Press Meet

జగన్‌ ప్రభుత్వంలో ప్రతీకారవాంఛ ఎక్కువైందని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విమర్శించారు. ప్రత్యర్థులను హింసించే సమయంలో అధికారం శాశ్వతం కాదని తెలుసుకోవాలన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల వల్లే అధికారులు వేధిస్తున్నారన్నారు. బస్సు బిజినెస్‌ను కొంత కాలం మానేయాలి అనుకుంటున్నట్టు వెల్లడించారు. పార్టీ మారేవాళ్లు అధినేతను ఏదో ఒకటి అనాలి కదా అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ సుజనా చౌదరి విమర్శలు చేశారని గుర్తు చేశారు. వేధింపులకు భయపడి పార్టీలు మారకూడదని హితవు పలికారు. పవన్‌ ఢిల్లీ పర్యటన ఎందుకో తెలీయదని పేర్కొన్నారు.