సీఎం జగన్‌తో కేంద్రమంత్రి భేటీ

08-11-2019

సీఎం జగన్‌తో కేంద్రమంత్రి భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ భేటీ అయ్యారు. సచివాలయంలో ముఖ్యమంత్రితో ఆయన సమావేశమయ్యారు. అనంతరం వివిధ చమురు కంపెనీల ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వారిద్దరూ సమీక్ష నిర్వహించారు. కడప ఉక్కు పరిశ్రమకు ఎన్‌ఎండీసీ నుంచి ఖనిజం సరఫరాకు ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్‌ అంగీకారం తెలిపారు. కాకినాడ, రాజమహేంద్రవరంలో పెట్రోలియం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. కడప ఉక్కు పరిశ్రమకు ఖనిజం సరఫరాకు కేంద్రం అంగీకారం తెలపడంతో తర్వలోనే ఎన్‌ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం జరగనుంది.