చంద్రబాబుకు షాక్‌

08-11-2019

చంద్రబాబుకు షాక్‌

భవననిర్మాణ కార్మికులకు అండగా ఈ నెల 14న విజయవాడలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీస్‌, మున్సిపల్‌ కమిషనర్లను టీడీపీ బృందం కోరింది. ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని సదరు అధికారులు సృష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం అనుమతి నిరాకరించినప్పటికీ చంద్రబాబు తలపెట్టిన దీక్ష కొనసాగుతుందని టీడీపీ నేతలు సృష్టం చేశారు. ప్రత్యామ్నాయంగా ధర్నాచౌక్‌ను పరిశీలిస్తున్నట్లు వారు తెలిపారు.