గాంధీ కుటుంబానికి షాకిచ్చిన కేంద్రం

08-11-2019

గాంధీ కుటుంబానికి షాకిచ్చిన కేంద్రం

గాంధీ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక వాద్రా కుటుంబానికి ఎస్‌పీజీ (స్పెషల్‌ ప్రొటక్షన్‌ గ్రూప్‌) రక్షణను ఉపసంహరించాలని కేంద్రం తాజాగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారికున్న ఎస్‌పీజి భద్రతను ఉపసంహరించి, జడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రత కల్పించనున్నట్టు ప్రభుత్వ వర్గాల తాజా సమాచారం. ప్రధాని, రాష్ట్రపతికి మాత్రమే ఎస్‌పీజీ భద్రత ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు ఎస్‌పీజీ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.