540 ఎకరాల్లో జేబీ సెరీన్ సిటీ..

01-11-2019

540 ఎకరాల్లో జేబీ సెరీన్ సిటీ..

రియల్‌ఎస్టేట్‌ కంపెనీల్లో ఒకటైన జెబీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌ నుంచి వస్తున్న ప్రాజెక్టు జెబి సెరినీ సిటీ. నాగార్జున సాగర్‌ రహదారిలో ఇబ్రహీంపట్నంలోని గురునానక్‌ సంస్థల చేరువలో ఈ  ఆధునిక లగ్జరీ ప్రాజెక్టును కంపెనీ కడుతోంది. దాదాపు 540 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో గేటెడ్‌ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టు, రిసార్టు, వాణిజ్య సముదాయాలు వంటివి అభివద్ధి చేస్తారు. ఈ ప్రాంతంలో ఆక్టోపస్‌, ఎన్‌ఎస్‌జీ, బీడీఎల్‌తో పాటు ఐటీసంస్థలు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మాసిటీతో పాటు రక్షణ రంగ సంస్థలు, విద్యాసంస్థల్లో పని చేసే ఉద్యోగులు ఈ ప్రాంతంలోనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే, వీరిని దష్టిలో పెట్టుకుని జేబీస్‌ సంస్థ జేబీస్‌ సెరీన్‌ సిటీకి అంకురార్పణ చేసింది. అందరికీ అందుబాటు ధరల్లో తమతమ స్థాయికి తగ్గట్టు ప్లాట్లను ఇందులో కొనుగోలు చేయవచ్చు. దీనికి అదనంగా.. మరో నలభై రెండు ఎకరాల్లో విల్లాలనూ కూడా కంపెనీ నిర్మిస్తోంది.

ఈ ప్రాజెక్టులో క్లబ్‌హౌజ్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నది. దీంతోపాటు ఎన్నో సౌకర్యాలను కల్పిస్తున్నారు. భూగర్భడ్రైనేజీ, కేబుల్‌ కనెక్షన్లు, విద్యుత్‌, బ్రాడ్‌బ్రాండ్‌తోపాటు పచ్చిక బయళ్లతోపాటు ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగించేందుకు చెట్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. జనరేటర్లతో విద్యుత్‌ బ్యాకప్‌ కల్పించారు. వెంచర్‌ చుట్టూ సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. క్రికెట్‌ పిచ్‌, టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ వంటివి ఆడుకోవడానికి వీలుగా ఆటస్థలాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ప్లాట్లతోపాటు విల్లాలను కూడా కంపెనీ నిర్మిస్తోంది.

www.jbinfraprojects.in