ఈస్ట్ హైదరాబాద్ లో పెరిగిన రియల్ జోరు

01-11-2019

ఈస్ట్ హైదరాబాద్ లో పెరిగిన రియల్ జోరు

హైదరాబాద్‌లో ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ అన్నీవైపులా విస్తృతమవుతోంది. ఇప్పుడు ఈస్ట్‌ హైదరాబాద్‌ ప్రాంతానికి డిమాండ్‌ ఏర్పడింది. మెట్రో రైలు డిపోతో ఒక్కసారిగా ఉప్పల్‌ రూపురేఖలు ప్రస్తుతం మారిపోయాయి. దానికితోడు అనేక కంపెనీలు ఉప్పల్‌ దిశగానే ఏర్పాటవుతున్నాయి. హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతం  అపార్టుమెంట్లతో నిండిపోయింది. పైగా, రేట్లు కూడా ఎక్కువగా ఉండటంతో కొనుగోలుదారులు తమ చూపును తూర్పు వైపు తిప్పారు. దానికితోడు నిన్నటివరకూ ఉప్పల్‌ నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఉప్పల్‌ ప్రాంతంలో కన్నా ఇతర చోట్లకే ప్రాముఖ్యత ఇచ్చారు. కాని  ప్రస్తుతం మెట్రో రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ్నుంచి మాదాపూర్‌, గచ్చిబౌలి వెళ్లేందుకు ఐటీ, ఐటీఈఎస్‌ నిపుణులు వంటివారు కూడా ఆసక్తి చూపుతుండటంతో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు ఈ ప్రాంతంలో తమ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రాధాన్యం?ఇచ్చాయి. పశ్చిమంతో పోల్చితే తూర్పు హైదరాబాద్‌లో ఇండ్లు, ఫ్లాట్ల ధరలు అందుబాటులో ఉండటంతో.. ఇక్కడ ఉండటానికే అధిక శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. పైగా, వీరిని దష్టిలో పెట్టుకుని బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్‌ మాళ్లు, మల్టీప్లెక్స్‌ థియేటర్లు వంటివి అందుబాటులోకి వస్తున్నాయి.

ఎన్‌ఎస్‌ఎల్‌, డీఎస్‌ఎల్‌ వంటి సంస్థలు 120 అడుగుల రామాంతపూర్‌ రోడ్డులో నివాస సముదాయాలు, ప్రప్రథమ షాపింగ్‌ మాల్‌, మల్టీప్లెక్స్‌, ఆఫీస్‌ స్పేస్‌ వంటివి నిర్మిస్తున్నాయి. ఇక్కడ దాదాపు ఇరవై అంతస్తుల నివాస సముదాయాల నిర్మాణానికి ప్రణాళికలు జరుగుతున్నయి. అదేవిధంగా, ఆరు స్క్రీన్ల మల్టీప్లెక్స్‌ థియేటర్లు, డెబ్బయ్‌కి పైగా చిన్న, మధ్య, పెద్ద రిటైల్‌ బ్రాండ్లు తమ ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో, ఈ ప్రాంతమంతా సరికొత్త ఆకర్షణగా నిలవనున్నది. నాగోలు స్టేషన్‌ నుంచి కాస్త ముందుకు వెళ్లగలిగితే చాలు.. ఆయా ప్రాంతానికి అటుఇటుగా అభివద్ధి చెందిన కాలనీలు ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ్నుంచి పశ్చిమానికి ప్రతిరోజు దాదాపు లక్ష మందికి పైగా ప్రయాణీకులు రాకపోకల్ని సాగిస్తున్నారని అంచనా. మెట్రో ద్వారా సులువుగా ప్రయాణించే అవకాశం ఉండటంతో ఉప్పల్‌, నాగోలు పరిసర ప్రాంతాల్లో నివసించడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నా

లుక్‌ ఈస్ట్‌ పాలసీ..

పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల్లో సుమారు 40 శాతం ఈస్ట్‌ హైదరాబాద్‌ నుంచే రాకపోకల్సి సాగిస్తారని అంచనా. ప్రస్తుతం పశ్చిమంలో కంపెనీలు అధికం కావడంతో, నగరంలోని ఇతర ప్రాంతాలను అభివ ద్ధి చేయాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు లుక్‌ ఈస్ట్‌ పాలసీకి శ్రీకారం చుట్టారు. ఉప్పల్‌, పోచారం వంటి ప్రాంతాల్లో ఐటీ సంస్థలను ఏర్పాటు చేస్తే అద్దెలో 25 శాతం రిబేటు, విద్యుత్తు చార్జీల్లో 25 శాతం తగ్గింపు, ఉచితంగా ఇంటర్నెట్‌ సదుపాయం, మెట్రోరైలు పాసుల్లోనూ 25 శాతం తగ్గింపు వంటి ప్రోత్సాహాకాల్ని అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నది. పైగా, పశ్చిమంతో పోల్చితే ఇక్కడి ఆఫీసు అద్దెలు కూడా తక్కువుండటం విశేషం.