డిసెంబరులో క్రియేట్ అవార్డ్స్ 2019

30-10-2019

డిసెంబరులో క్రియేట్ అవార్డ్స్ 2019

ఈ ఏడాది క్రియేట్‌ అవార్డులను డిసెంబరులో నిర్వహించాలని భావిస్తున్నట్లు క్రెడాయ్‌ తెలంగాణ చైర్మన్‌ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. 2017లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి ఈటెల రాజేందర్‌, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆ కార్యక్రమంలో నిర్మాణాల్లో నాణ్యతను, నూతనత్వాన్ని ఆవిష్కరించిన సంస్థలకు అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రోత్సాహంతో ఈసారి మరింత మెరుగైన రీతిలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు  క్రెడాయ్‌ తెలంగాణ నాయకులు పేర్కొంటున్నారు.