దేశంలో గృహాల నిర్మాణానికి కేంద్రం ప్రోత్సాహం

30-10-2019

దేశంలో గృహాల నిర్మాణానికి కేంద్రం ప్రోత్సాహం

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో 2020 సంవత్సరం పూర్తయ్యేలోపు 4.5 లక్షల అందుబాటు గృహాలను నిర్మించాలన్న లక్ష్యాన్ని పలు సంస్థలు నిర్దేశించుకున్నట్టు వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం అధిక పన్ను ప్రయోజనాలు అందించడం ద్వారా కొనుగోళ్లకు ప్రోత్సాహం లభించిందని, 2022 నాటికి అందరికీ గృహాలు అందించాలనే ఆలోచనతో కేంద్రం కొన్ని నెలలుగా ఈ రంగాన్ని అభివద్ధి చేసేందుకు చర్యలు చేపట్టిందని నివేదికలో పేర్కొన్నారు. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్‌ సందర్భంగా రూ.45 లక్షల్లోపు విలువ చేసే గృహాల రుణాలపై చెల్లించే వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని ప్రభుత్వం ఏటా రూ.1.5 లక్షల నుంచి 3.5 లక్షలకు పెంచినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నివేదిక ప్రకారం 2020 డిసెంబర్‌ వరకు భారతదేశంలో 7.95 లక్షల గృహాలు పంపిణీ జరుగుతుందని అంచనా. 2019 చివరి మూడు నెలల్లో 3.1 లక్షలకు పైగా అందుబాటు గృహాలు మార్కెట్‌లో అందుబాటులోకి రాగా, మిగిలిన 4.83 లక్షల యూనిట్లు 2020 వరకు అందుబాటులోకి వస్తాయని డెవలపర్లు చెబుతున్నారు.