సువర్ణభూమితో సొంతింటికల సాకారం

24-10-2019

సువర్ణభూమితో సొంతింటికల సాకారం

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ కూడా ఒకటి.  రంగారెడ్డి జిల్లాల్లో కొత్తూరు జేపీ దర్గా రోడ్డుకు ఆనుకుని వాహినీస్‌ సువర్ణ సంపద పేరుతో వెంచర్‌కు శ్రీకారం చుట్టింది. సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునేవారికి ఈ వెంచర్‌ చక్కటి అవకాశమని పేర్కొంటూ, ఈ వెంచర్‌ చుట్టుపక్కలా ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని చెబుతోంది. రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టుకు సులువుగా ఇక్కడనుంచి చేరుకోవచ్చని, సింబయాసిస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఎల్వీ ప్రసాద్‌ ఐ హాస్పిటల్‌, జార్జియా టెక్‌ యూనివర్సిటీ వంటివి ఈ వెంచర్‌కు అతి చేరువలో ఉన్నాయని చెబుతున్నది. పక్కనే ఉన్న షాద్‌నగర్‌ టౌన్‌ నుంచి రైల్వే ప్రయాణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నది. 

వాహినీస్‌ సువర్ణ సంపద వెంచర్‌కు హెచ్‌ంఎడీఏ నుంచి లేఅవుట్‌ అనుమతి ఉంది. వెడల్పు సీసీ, బీటీ రోడ్లు, పిల్లలు ఆడుకునేందుకు వీలుగా పార్కు, భూగర్భ డైనేజీ వ్యవస్థ, ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంకు, ప్లాట్లకు విద్యుత్తు సౌకర్యం, ప్రాజెక్టు మొత్తానికి ప్రహారీ గోడ వంటి అనేక ఆధునిక సౌకర్యాల్ని ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ప్లాటు కొనుక్కున్నవారు ఎంచక్కా విల్లాలు, వ్యక్తిగత ఇండ్లను నిర్మించుకునే సౌలభ్యముంది. ఇతర వివరాలకోసం కంపెనీ వెబ్‌సైట్‌ను చూడండి.

http://www.suvarnabhoomiinfra.com/Suvarna-Sampada.html